- Advertisement -
త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని మరో సారి రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సర్వే ఫలితాలు నిరూపించాయి. నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 19 సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.
అలాగే జనసేన పార్టీ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది. ఇక వైసీపీకి 41.3 శాతం ఓట్లు టీడీపీకి 33.1 శాతం, కాంగ్రెస్‌కి 9.8 శాతం, బీజేపీకి 7.2 శాతం, ఇతరులకు 8.6 శాతం ఓట్లు వస్తాయని సీఓటర్ సర్వే స్పష్టం చేసింది. మరోసారి అధికారంలోకి రావాలన్న బాబు ఆశలకు గండి పడినట్లే.
