Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ పేరు మార్పు.. బీజేపీకి ఆత్రం ఎందుకు ?

- Advertisement -

ఏపీలో ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై జరుగుతున్నా రాజకీయ రచ్చ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ పేరును తీసివేసి వైఎస్ఆర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం చేర్చడంతో ప్రతిపక్ష టీడీపీతో పాటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతు ఇటు సామాన్యుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక నందమూరి కుటుంబ సభ్యులు తమదైన రీతిలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఘాటుగా స్పందింస్తున్నారు. అయితే ఈ ఎంటైర్ ఇష్యూ టీడీపీ, వైసీపీ మద్య జరుగుతున్నప్పటికి.. ఈ వివాదాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

అయితే ఎన్టీఆర్ పేరు మార్పు ను బీజేపీ అటు సమర్థించడమూ లేదు.. అలాగని వ్యతిరేకతను కూడా ప్రదర్శించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ అటు టీడీపీ తోనూ, ఇటు వైసీపీ తోనూ తటస్థంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఇక తాజా వివాదంగా మారిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై అటు టిడిపి, అధికార వైసీపీ రెండు పార్టీల వైఖరిని తప్పుబడుతూ.. ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. ఎన్టీఆర్ కుమార్తె అయిన పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో సహజంగానే పురందేశ్వరి వైసీపీ సర్కార్ పై గట్టిగానే విమర్శలు చేశారు. ఇక బీజేపీ ఎంపీ జి‌వి‌ఎల్ నరసింహారావు స్పందించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

“భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసు గెలిచిన ఎన్టీఆర్ ను కించపరిచేలా చేయడం వైసీపీ సర్కార్ చేసింది ముమ్మాటికి తప్పేనని.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని.. జి‌వి‌ఎల్ నరసింహారావు ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. ఇక అదే సమయంలో టీడీపీ వైఖరిని కూడా తప్పుబడుతు..ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారు నేడు ఆయనపై అతిప్రేమ ఒలకబోస్తున్నారని.. జి‌వి‌ఎల్ టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇలా రెండు పార్టీలపై విమర్శలు గుప్పిస్తు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. నిజానికి బీజేపీ అధిష్టానంతో ఏపీలోని ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల నేతలు సన్నిహితంగానే మెలుగుతూ వస్తున్నారు. దాంతో ఈ వివాదంపై కమలనాథులు మౌనం వహిస్తారని భావించరంతా.. కానీ ఊహించని రీతిలో ఇరు పార్టీల వైఖరిని తప్పుబడుతోంది బీజేపీ. అయితే ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకే కమలనాథులు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -