Friday, May 3, 2024
- Advertisement -

వామ్మో : ఎన్నికల ఖర్చు..: 5000 కోట్లు !

- Advertisement -

మునుగోడు ఉపఎన్నిక వేళ టి‌ఆర్‌ఎస్, బీజేపీ నేతల మద్య మాటల తుటాలు పెళుతున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్లతో బీజేపీకి అమ్ముడుపోయాడని, ఇటీవల టి‌ఆర్‌ఎస్ నేతలు గట్టిగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. కే‌సి‌ఆర్ ను ఉద్దేశించి బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు కే‌సి‌ఆర్ కేవలం ఎన్నికల కోసమే 5000 కోట్లు ఖర్చు చేశారని ఈటెల ఆరోపించారు. మునుగోడు నియోజిక వర్గంలోని మర్రిగూడ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పై విధంగా స్పందించారు ఈటెల.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలలో 50 లక్షలు ఉంటే ఎమ్మెల్యేగా గెలవవచ్చని, కానీ తెలంగాణలో ఒక్కఉపఎన్నికలోనే వందల కోట్లు ఖర్చు కే‌సి‌ఆర్ ఖర్చు చేస్తున్నారని ఈటెల చెప్పుకొచ్చారు. టి‌ఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో రూ.870 కోట్లు, అలాగే కే‌సి‌ఆర్ సొంత విమానం కొనుక్కోవడానికి వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఈటెల ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక ద్వారా ప్రజలు కే‌సి‌ఆర్ కు బుద్ది చెబుతారని, ఈ ఎన్నిక కే‌సి‌ఆర్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్నా యుద్దం అని ఈటెల తనదైన రీతిలో కే‌సి‌ఆర్ విమర్శనస్త్రాలు సంధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -