Thursday, May 16, 2024
- Advertisement -

ప‌చ్చ‌ఖండువా క‌ప్పుకున్న ఫిరాయింపు తేత‌ ..రాజ్యాంగ దినోత్సవం రోజునే ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ….

- Advertisement -

ఏపీలో రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. నీతిమాలిక రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. రాజ్యాంగాన్ని గౌర‌వించాల్సిన సీఎం దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారు. రాజ్యాంగం దినోత్స‌వం రోజునె మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీ ఖండువా క‌ప్పుకున్నారు. సాక్ష్యాత్తు సీఎం ప‌చ్చ‌కండువా క‌ప్పి రాజ్యాంగాన్ని అప‌హాష్యం చేశారు.

ఒకప్పుడు ‘చంద్రబాబు తల తెగనరుకుతాం..’ అన్నది ఈవిడగారే ఇప్పుడు బాబు పాదాల ద‌గ్గ‌ర త‌ల‌ను తాక‌ట్టు పెట్టారు. పార్టీలో చేరేందుకు రూ.25కోట్లకు పైగా డీల్‌ కుదిరిందని విశ్వసనీయ సమాచారం. రూ.10 కోట్లు అడ్వాన్సుగా అందించారని, మిగిలిన రూ.15 కోట్లు కమీషన్లు దక్కే పనుల రూపంలో అందించబోతున్నారని తెలుస్తోంది. ఆమెతో పాటు ఆయా గ్రామాల స‌ర్పంచులు.. ప్ర‌జాప్ర‌తినిధులు కూడా టీడీపీలో చేరారు. ఆమె చేరిక‌తో మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన‌ట్ల‌యింది.

అభివృద్ధికి దూరంగా ఉన్న పాడేరు నియోజకవర్గానికి మరిన్ని నిధులను కేటాయించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు. కాగా, 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -