Friday, April 19, 2024
- Advertisement -

జనసేనాని దీక్ష వెనుక అసలు కథ ఇదా…?

- Advertisement -

విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాలకు ఏడాది కావొస్తుంది. గతంలో విశాఖలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు.. జనసేనాని ఇప్పుడు ఎలాంటి ప్లాన్‌ చేస్తున్నారు. కార్మిక సంఘాలకు తన మద్దతు కొనసాగిస్తారా.. వారికోసం ముందుకొస్తారా…

విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళనలు చేపట్టి దాదాపు సంవత్సరం అయ్యింది. గతంలో విశాఖ వేదికగా కార్మికులకు మద్దతుగా ఉండానన్న పవన్‌ తాను చెప్పిట్లుగా కార్మిక సంఘాలతో తన మద్దతును కొనసాగిస్తున్నారు. కార్మిక సంఘాలకు మద్దతుగా ఈ నెల 12న విశాఖలో దీక్షకు దిగనున్నట్లు జనసేనాని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. కేంద్ర వైఖరిని నిరసిస్తూ గతంలో కేంద్రానికి లేఖ రాసిన పవన్‌ ఇప్పుడు దీక్షకు దిగనున్నారు.

దీంతో పవన్‌కు అమరావతి రైతులపై ప్రేమ లేదని, అందుకే వారిని పట్టీ, పట్టించుకున్నట్లు వ్యహరిస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచే పోటీ చేయబోతున్నాడని, అందుకే విశాఖ ప్రజలను తనవైపు తిప్పుకోవడాకి దీక్షలు, మహా సభలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సాధాలు… రాధాకృష్ణకు అక్కడేంపని..?

పెరుగుతున్న ఒమైక్రాన్‌ కేసులు

టార్గెట్ రఘురామ కృష్ణంరాజు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -