Friday, May 10, 2024
- Advertisement -

ఏపీలో ఊపందుకున్న యూ ట‌ర్న్ రాజ‌కీయాలు..

- Advertisement -

అవ‌స‌రానికి సాధ్యంకాని హామీలివ్వ‌డం..అవ‌స‌రం తీరాక వాటిని నెర‌వేర్చ‌కుండా కాక‌మ్మ క‌థ‌లు చెప్ప‌డం చివ‌రిగా హామీల‌పై చేతులెత్తేయ‌డం లాంటి చ‌ర్య‌ల‌ను యూట‌ర్న్ రాజ‌కీయాలంటారు.ఏపీలో ఇప్పుడు యూట‌ర్న్ రాజ‌కీయాలు జోరందుకున్నాయి.

ఏపీలో యూట‌ర్న్ రాజ‌కీయ నాకుల‌లో ముందుగా గుర్ర‌కొచ్చేది సీఎం చంద్ర‌బాబు నాయుడు. 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌పై ఎన్నిసార్లు యూట‌ర్న్ రాజ‌కీయాలు చేశారో అంద‌రికీ తెలిసిందే. అంద‌రికీ తెల‌సినా నాదే రైట్ ట‌ర్న్‌రాజ‌కీయాలంటూ యొల్లో మీడియాతో ప్ర‌జ‌ల‌ను నమ్మించే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆయ‌న‌కు మామూలే.

రాష్ట్రానికి ప్ర‌త్యేకహోదాపై బాబు ఎన్ని సార్లు యూట‌ర్న్ రాజ‌కీయాలు చేశారో ప్ర‌జ‌లంద‌రికీ తెల‌సిందే. కేంద్రం హోదా ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని నాలుగేళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశానని, అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, లక్షల కోట్ల పెట్టుబడులు కుంభవృష్టిలా కురుస్తున్నాయని స‌మ‌యం దొరికిప్పుడ‌ల్లా అరిగిపోయిన డ‌బ్బాలాగా ఊదరగొడుతుంటారు.

2014 ఎన్నికల ప్రచారంలో మోదీ, బాబు, వెంకయ్య అధికారంలోకి రాగానే హోదా అన్నేళ్లు ఇస్తామని, ఇన్నేళ్లు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, ఆ తరువాత కుదరదని యూటర్న్‌ తీసుకున్నారు. ఇక్కడి నుంచి మొదలైన యూటర్న్‌ల కథ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్ర‌త్యేక‌హోదా తో ఏమొస్తాది, ప్ర‌త్యేక ప్యాకేజీతోనే రాష్ట్ర అభివృద్ధి జ‌రుగుతుంద‌ని సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్ర‌క‌టించారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌త్యేక‌హోదాపై అలు పెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో జ‌గ‌న్‌కు ఎక్క‌డ మంచిపేరు వ‌స్తాదోన‌ని యూట‌ర్న్ తీసుకున్నారు. కేంద్ర‌మే మోసం చేసింద‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టారు. చంద్ర‌బాబు తీసుకున్న యూట‌ర్న్‌లు చాలానే ఉన్నాయి.

తాజాగా కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై వైఎస్ జ‌గ‌న్ యూట‌ర్న్ తీసుకున్నార‌ని కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విమ‌ర్శ‌లు చేశారు. తీఊర్పు గోదావరి జిల్లా జ‌గ్గంపేట బ‌హిరంగ స‌భ‌లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం నాచేతిలో లేద‌ని కేంద్రం చేతిలో ఉంద‌ని జగన్‌ చెప్పడం పెద్ద వివాదానికి దారి తీసింది. తాను చేయగలినవే చెబుతానని, చంద్రబాబులా మోసం చేయలేనని జగన్‌ చెప్పడం ముద్రగడకు నచ్చలేదు. ప్రస్తుతం జగన్‌ చుట్టూ ‘కాపు’ వివాదం చెలరేగుతోంది. ఎన్నికల్లో ఇది ఆయనకు నష్టం కలిగిస్తుందని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.

ఈమధ్య జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేయడం జగన్‌కు చెడ్డ పేరు తెచ్చింది. సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి కలిగింది. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు న‌ష్టం క‌లిగిస్తాయ‌ని పార్టీనేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

మంజునాథ కమిషన్‌ వేసి చాలాకాలం కథ నడిపిన చంద్రబాబు చివరకు కమిషన్‌ ఛైర్మన్‌ నివేదిక ఇవ్వకముందే సభ్యుల నివేదికను ఆధారం చేసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపి మమ అనిపించారు. అంటే తనకు మట్టి అంటకుండా బాల్‌ కేంద్రం కోర్టులో ఉందంటున్నారు.

కాపు రిజర్వేషన్లను అసెంబ్లీలో సమర్థించిన జ‌గ‌న్ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నాడని ముద్ర‌గ‌డ ఆరోపిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కూ యూటర్న్‌లు ఉన్నాయి. గంభీరంగా మాటలు చెప్పడం తప్ప ఏ పనీ చేయలేదు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి నేను మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని మాట‌లు చెప్ప‌డం త‌ప్ప ఆయ‌న చేసిందేమిలేదు. హోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తానంటాడు త‌ర్వాత ఆ ఊసెత్త‌డు. ఇలా ఏపీలో యూట‌ర్న్ రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -