Tuesday, April 16, 2024
- Advertisement -

KCR National Party : జాతీయ పార్టీకి రంగం సిద్దం.. ప్రకటనే తరువాయి ?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన ఆ విషయాన్ని పలు మార్లు స్పష్టం చేశారు కూడా. అయితే ఆయన జాతీయ రాజకీయాల రంగప్రవేశం ఎలా ఉండబోతుందనేదే అందరిలోనూ మెదులుతున్న ప్రదానమైన ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని ఇప్పటికే కే‌సి‌ఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. మరి బీజేపీ లాంటి బలమైన శక్తిని ఢీ కొట్టడానికి కే‌సి‌ఆర్ సింగిల్ గానే బరిలోకి దిగుతారా ? లేదా ఇతర పార్టీలను కలుపుకొని బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తారా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి.

అయితే కే‌సి‌ఆర్ అనుసరిస్తున్న తాజా పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దొరికే రోజు దగ్గర్లోనే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై వార్తలు వస్తున్నప్పటికి.. టి‌ఆర్‌ఎస్ శ్రేణుల నుంచి గాని, కే‌సి‌ఆర్ నుంచి గాని ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాలేదు. దాంతో కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ ఉంటుందా ? ఉండదా ? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే.. ఇతర పార్టీలతో కూటమిగా వెళ్ళేకన్న.. ముందు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత పొత్తుల విషయంలో నిర్ణయం తిసూయికోవాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం జాతీయ పార్టీ ప్రకటనకు కూడా ముహూర్తం ఖరారు చేసినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 11న కర్నాటక మాజీ సి‌ఎం కుమారస్వామి హైదరబాద్ వచ్చి కే‌సి‌ఆర్ ను కలవనున్నారు. ఈ నేపథ్యంలో హైదరబాద్ వేదికగా కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనను సుసాధ్యం చేసి తెలంగాణలో చెరిగిపోని ముద్ర వేసిన కే‌సి‌ఆర్.. మరి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేందుకు అన్నీ విధాలుగా సిద్దం కావడంతో ఆయన జాతీయ స్థాయిలో ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read

కే‌సి‌ఆర్ నేషనల్ పాలిటిక్స్.. కీ ఫ్యాక్టర్స్ ఆ నాలుగే !

“జగన్ కోచింగ్” అంటే అదే మరి !

చంద్రబాబు మనసులో ఏముంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -