Wednesday, April 24, 2024
- Advertisement -

రేవంత్ ” సారి”.. వద్దంటున్న కోమటిరెడ్డి !

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు చుట్టూ రాజకీయ రగడ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో ఈ ఉపఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తోన్న ప్రధాన పార్టీలు గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మునుగోడు సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీది కావడంతో ఆ పార్టీకి మునుగోడు ఉపఎన్నికలు కీలకంగా మారాయి. దాంతో కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా.. వాటికి ప్రతిస్పందన రాజగోపాల్ రెడ్డి కూడా గట్టిగానే జవాబిచ్చారు. ఇక కోమటిరెడ్డి మరో బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. .

అంతే కాకుండా కాంగ్రెస్ కార్యకలాపాలకు కూడా ఆయన అంటినటనట్టే ఉంటున్నారు. ఇటీవల మునుగోడు లో జరిగిన సభకు కూడా ఆయన హాజరు కాలేదు దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మునుగోడు సభలో అడ్డంకి దయాకర్ వెంకటరెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలాలు కూడా వాడడంతో అడ్డంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా వెంకటరెడ్డి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే అడ్డంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ తెలిపారు. ” తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోసించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదని, అలా మాట్లాడిన అడ్డంకి దయాకర్ పై చర్యలు తీసుకుంటామని ” రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే రేవంత్ రెడ్డి క్షమాపణను వెంకట రెడ్డి లైట్ తీసుకున్నారు. అడ్డంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే రేవంత్ రెడ్డి క్షమాపణను అంగీకరిస్తానని, అప్పుడే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ” కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది. మరి మునుగోడు ఉప ఎన్నికల ముందు ఆ నియోజిక వర్గంలో బలమైన నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు.. కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందో చూడాలి.

Also Read

మోడీ తటస్థ వైఖరి.. వెనుక రాజకీయ వ్యూహం !

కే‌సిఆర్ ఈడీ ట్రాప్ పడతారా ?

ఏకంగా పి‌ఎం పదవీకే పోటీ.. అందుకే తగతెంపులు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -