Friday, April 26, 2024
- Advertisement -

వైసీపీ జాతీయ ప్లీన‌రీలో స్పీచ్ ద్వారా నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లో ఉత్సాహం నింపిన‌ శ‌ర్మిళ‌

- Advertisement -

విజ‌య‌వాడ‌లో వైసీపీ జాతీయ ప్లీన‌రీ అంగ‌రం వైభ‌వంగా జ‌రుగుతోంది.ప్లీన‌రీలో వైఎస్ షర్మిల బాబు పాల‌న‌పైచేసిన వ్యాఖ్యలు ఆక‌ట్టుకున్నాయి.15 నిముషాల మత్రమే మాట్లాడిన షర్మిల నేతలను, శ్రేణులను బాగా ఆకట్టుకున్నారు.

పోయిన ఎన్నికల్లో టిడిపి కూటమికి, వైసీపీకి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కేవలం 5 లక్షలు మాత్రమే అన్నారు. 5 లక్షల మెజారిటీ కడప పార్లమెంట్ స్ధానంలో సోదరుడు జగన్, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎప్పుడో వచ్చేసిన విషయాన్ని గుర్తు చేసారు.
ఓ ఎంపికి 5 లక్షల ఓట్ల మెజారిటీ ఎక్కువ అవ్వచ్చేమో గానీ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కూటమికి వచ్చిన మొత్తం 5 లక్షల ఓట్ల ఆధిక్యత చాలా చాలా తక్కువన్నారు. అదికూడా చంద్రబాబు మొహం చూసి రాలేదని, మోడి వల్ల, రుణమాఫీ లాంటి మోసపూరిత వాగ్దానాల వల్లే వచ్చాయన్నారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను అన్నిసార్లు చంద్రబాబు మోసం చేయలేరన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.

తమకు ఓట్లేసిన ఓటర్లేనే కాకుండా రాష్ట్ర ప్రజలను మొత్తం మోసి చేసిన నీచపు రాజకీయ చరిత్ర చంద్రబాబుది అని ధ్వజమెత్తారు. ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు ఎద్దేవా చేసారు.అధికారం అడ్డం పెట్టుకుని, అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను, ఎవరిని వీలైతే వారిని ఉచ్ఛం, నీచం లేకుండా కొనటం. అడ్డంగా టేపుల్లో ‘బ్రీఫ్డ్ మీ’ అని, తన గొంతుతో అడ్డంగా దొరికినా, ఈ రోజు వరకూ విచారణ జరగకుండా తప్పించుకు తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు.

చంద్రబాబు మోసం దేశమంతా తెలిసిపోయిందని, చివరకు మోడికి కూడా అర్ధమైపోయిందన్నారు. ఇక చంద్రబాబు పప్పులుడకవని, ఇంట్లో ఉన్న పప్పు తప్ప అని ఎద్దేవా చేసారు. ఎదురుగా వచ్చి పోరాడాలంటే ధైర్యం కావాలని, చంద్రబాబు చరిత్ర మొత్తం వెన్నుపోటేనని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది రాజన్న రాజ్యమేనంటూ ఘంటాపధంగా చెప్పారు.

Also read

  1. జగన్‌ని, షర్మిలని వైఎస్ఆర్ ఏమని పిలిచేవారో తెలిసా..?
  2. జ‌గ‌న్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కోర్టు
  3. ప్లీన‌రీ వేదికగా వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయం ఇదే..?
  4. టీడీపీకి భయం పట్టుకుంది.. అందుకే రంగంలోకి డిప్యూటీ సీఎం కేఈ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -