Thursday, May 9, 2024
- Advertisement -

టీడీపీ క్రియేటివిటీ ప్రచారంతో చిక్కుల్లో బొత్స

- Advertisement -
  • జగన్ అక్రమాలతో రాష్ట్రానికి మచ్చ : బొత్స.
  • అవినీతి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్ : బొత్స
  • తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు : బొత్స
  • ఇలాంటి కొడుకును కన్నందుకు విజయమ్మ ఎంత బాధపడుతోందో : బొత్స

ఏంటీ స్టేట్ మెంట్లు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు, బొత్స సత్యనారాయణ అనుచరులు కంగారు పడకండి. జగన్ కు బొత్స సత్యనారాయణకు చెడిందా ? ఇద్దరి మధ్య అగాధం పెరిగిందా ? బొత్స మళ్లీ పార్టీ మారుతున్నారా ? అని అనుమానించకండి. మరి ఈ స్టేట్ మెంట్లు ఏంటి ? జగన్ ను ఉద్దేశించి ఇంత ఘాటు విమర్శలు ఎప్పుడు చేశారు ? అని ఆలోచించకండి. ప్రస్తుతానికి వైఎస్ జగన్ తోనే బొత్స సత్యనారాయణ ఉన్నారు. బొత్స ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఆలోచన లేదు. కానీ ఈ విమర్శలు, స్టెట్ మెంట్లు ఆయన కాంగ్రెస్ చీఫ్ గా, మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినవి. కాంగ్రెస్ నుంచి జగన్ మోహన్ రెడ్డి విడిపోయి వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నప్పుడు బొత్స చేసిన విమర్శలు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని నాడు బొత్స చేసిన విమర్శలు, ఘాటు కామెంట్లు, అవినీతి ఆరోపణలు అప్పట్లో పలు ప్రధాన పత్రికల్లో వచ్చాయి. ఆ వార్తల క్లిప్పింగులను ఇప్పుడు బొత్స సొంత జిల్లా అయిన విజయనగరంలో టీడీపీ నేతలు సేకరించారు. వాటన్నింటితో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. ప్రధానంగా లక్కవరపుకోటలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు.

త్వరలో వైఎస్ జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలోకి అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే 11 జిల్లాల్లో జగన్ పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. స్వచ్ఛంధంగా జనం తరలిరావడంతో పాటు, బహిరంగ సభలకు ఆయా స్థానిక నేతల జనసమీకరణతో జగన్ సభలు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోనూ పాదయాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ సీపీ నేతగా, విజయనగరం జిల్లాకు చెందిన నాయకుడిగా బొత్స సత్యనారాయణపై ఉంది. ఆయన కూడా ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. దీంతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వినూత్న ప్రచారానికి తెరలేపారు. జగన్ దృష్టిలో బొత్సను పలుచన చేయడానికి, ఆయనకు ప్రాధాన్యత తగ్గించడానికి కాస్తా క్రియేటివ్ గా ఆలోచించారు. జగన్ పై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం సహజమే. కానీ జగన్ పార్టీలోని కీలకనేత ఒకప్పుడు జగన్ పై చేసిన తీవ్ర విమర్శలను ఓ సారి జగన్ కు గుర్తు చేసినట్టు ఉంటుంది. జనానికి తాము చెప్పాల్సిన పని లేకుండా, వారితోనే చెప్పించినట్టు ఉంటుంది, జగన్ వద్ద బొత్స పరువు తీసేసినట్టవుతుంది.

వైఎస్ఆర్ సీపీలో బొత్స ప్రాధాన్యత తగ్గించడమూ జరిగిపోతుందని ఆలోచించిన విజయనగరం జిల్లా టీడీపీ నేతలు వినూత్నంగా ప్రచారానికి తెరలేపారు. ఆనాడు బొత్స చేసిన విమర్శలు, ఆరోపణలపై ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాలను ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లగా ప్రచురించి విజయనగరం జిల్లాలో విస్తృతంగా ఏర్పాటు చేశారు. దీంతో క్రియేటివిటీ అదిరింది అని చంద్రబాబు నుంచి టీడీపీ నేతలకు ప్రశంసలు లభిస్తుంటే, బొత్స వర్గం మాత్రం టీడీపీపై కస్సుబుస్సులాడుతోంది. రేపు పాదయాత్రలో దారి పొడవునా వీటిని జగన్ చూస్తే తన రాజకీయ భవిష్యత్ ఏంటని ? ఇప్పటికిప్పుడు బయటకు ఏమీ అనకపోయినా, తన అవకాశవాద రాజకీయాలను కచ్చితంగా మనసులో పెట్టుకుంటాడని, రేపు అధికారంలోకి వచ్చాక తనను తొక్కి పడేస్తాడని బొత్స ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలిగించాలని ప్రయత్నాలు చేయిస్తున్నారు. కానీ అధికార పార్టీ ఏర్పాటు చేయడంతో ఏం చేయలేక ఏం జరుగుతుందా ? అని టెన్షన్ పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -