Monday, May 6, 2024
- Advertisement -

బాబుకు షాక్ః నూజివీడు టిడిపిని వైసీపిలో విలీనం చేసిన టిడిపి కౌన్సిలర్స్

- Advertisement -

మోడీ ప్రభుత్వంపై ఎంపిల పోరాటాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎపి కోసం కష్టపడుతున్నాడని పచ్చ మీడియా 24గంటలూ చెప్తోంది. కానీ అసలు నిజం ఏంటో తెలుసా…ఈ విపత్కర పరిస్థితిలో కూడా చంద్రబాబు వైకాపాను బలహీనం చేయడం కోసం ఫిరాయింపు రాజకీయాలు గట్టిగా చేస్తున్నాడు.

నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి బడ్జెట్‌లో కూడా చిప్పే గతి అన్నట్టుగా వ్యవహరించింది. చంద్రబాబు ప్రజల కోసమే పనిచేస్తున్నట్టయితే ఆ వెంటనే మోడీకి బై చెప్పేసి పోరాటం చేయడానికి రెడీ అవ్వాలి. కానీ చంద్రబాబుతో సహా టిడిపి ఎంపిలు, పచ్చ మీడియా జనాలు మాత్రం డ్రామాలు ఆడుతున్నారు. టిడిపి కేంద్రమంత్రులకు ఈ సారి బడ్జెట్‌లో ఎపికి చిప్పే గతి అన్న విషయం ముందే తెలుసు. చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకూ మౌనంగా ఉండి ….ఆ తర్వాత ప్రజల్లో ఓ స్థాయి వ్యతిరేకత వచ్చేసరికి ఈ వ్యతిరేకతను వైకాపాపైకి నెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు ప్రోత్సహించడం ఆశ్ఛర్యపరుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ సభ్బులకు కూడా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు వైకాపా అధికారంలో ఉన్న నూజివీడు పురపాలక కౌన్సిల్‌లో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ వైకాపా సభ్యులు 22 వార్డులు గెలిచారు. ఎనిమిది మంది టిడిపి సభ్యులు ఉన్నారు.

అయితే కృష్ణా జిల్లా మొత్తాన్ని టిడిపి అధీనంలోకి తీసుకురావాలనుకుంటున్న చంద్రబాబు ఇక్కడ కూడా టిడిపి జెండా ఎగరేయాలనుకున్నారు. బడ్జెట్ ఆమోదం సమావేశానికి రాకుండా 11 మంది కౌన్సిలర్స్‌ని మేనేజ్ చేశాడు. వైకాపాను డిఫెన్స్‌లో పడేశామనుకున్నారు. అయితే ఆశ్ఛర్యకరంగా టిడిపి కౌన్సిలర్స్ అందరూ కూడా వైకాపాకు మద్దతిచ్చారు. ప్రతిపక్షమైన టిడిపి అధికార పార్టీ వైకాపాలో విలీనం చేసి పడేశారు. సమావేశానికి రాని పాదం సత్యనారాయణ సంతకాన్ని కూడా హాజరైన టిడిపి సభ్యుల్లో ఒకరు చేసేసి మొత్తం పార్టీని అధికార పార్టీకి మద్దతుగా కలిపేశారు. అధికారంలో ఉన్న వైకాపాను ఏదో చేద్దామనుకున్న టిడిపి అధినేత ఆశలు బూమరాంగ్ అయి మొత్తం టిడిపినే వైకాపాలో విలీనం అయిన పరిస్థితి తలెత్తడంతో దిమ్మతిరిగే షాక్ తగిలింది. అసలే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్న పరిస్థితి. జగన్ పాదయాత్ర తర్వాత నుంచీ సర్వేలన్నీ కూడా జగన్‌నే గెలుస్తాడని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఒక్క ఏడాది కంటే కూడా వచ్చే ఐదేళ్ళ కాలాన్ని దృష్టిలో పెట్టుకునే టిడిపి కౌన్సిలర్స్ పూర్తిగా జెండా ఎత్తేశారని విశ్లేషకులు చెప్తున్నారు. నీతిమాలిన ఫిరాయింపు రాజకీయాలతో వైకాపాను పూర్తిగా లేకుండా చేద్దామని అనుక్షణం తపిస్తున్న చంద్రబాబుకు ఈ పరిణామం మాత్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -