Friday, May 10, 2024
- Advertisement -

టీడీపీ ఎంపీల బ‌స్సు యాత్ర వాయిదా…?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై పోరాటం ఉధృతం చేయాలనుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ ఎంపీలు షాక్‌ ఇచ్చారు. హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుండటంతో అప్రమత్తమైన చంద్రబాబు ఆ పార్టీకి పోటీగా కార్యక్రమాలు రూపొందించాలనుకున్నారు. ఆ దిశంగా టీడీపీ ఎంపీలతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ యాత్రకు సంబంధించి రూట్‌ మ్యాప్‌పై చర్చించేందుకే ఢిల్లీలో ఉన్న ఎంపీలందరూ అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్ర వాయిదా పడటంపై ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీ నుంచి వెంటనే రావాలన్న చంద్రబాబు ఆదేశాలతో అమరావతికి వచ్చిన ఆయన నిరసనలన్నీ ఒకే రోజు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీలో చాలా రోజులు ఉండి వచ్చామని, తాము కనీసం ఇంటికి వెళ్లి పెళ్లాం ముఖమైనా చూడవద్దా? అని చమత్కరించారు. అప్పుడే యాత్ర అంటూ బస్సు ఎక్కమంటే ఎలాగని ప్రశ్నించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమకుందని అభిప్రాయపడ్డ జేసీ, అతి త్వరలోనే బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎంపీలతో జరగాల్సిన సమావేశం కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఎంపీల బస్సు యాత్ర అంటూ హడావుడి చేసిన చంద్రబాబుకు ఎంపీలు …యాత్రకు సుముఖంగా లేకపోవడంతో తదుపరి కార్యాచరణ దిశగా పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -