సిద్ధార్థ్ లూథ్రా…ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసి పక్కా సాక్ష్యాధారాలతో ఆయన్ని రిమాండ్‌కు పంపేలా చేసింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో గానీ, ఆయన చేసిన అవినీతిని సాక్ష్యాధారలతో నిరూపించడంలో సీఐడీ సక్సెస్ అయింది. జరిగిన అవినీతి బాగోతాన్ని పూసగుచ్చినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. ప్రధాన కుట్రదారు చంద్రబాబేనని తేల్చింది.
దీంతో కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న బాబు…సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను బరిలోకి దించారు. ఎలాంటి కేసైనా వాదనలు గట్టిగా వినిపిస్తారనే పేరు లూథ్రాకు ఉంది. ఈ నేపథ్యంలోనే బాబు భారీ ఆశలు పెట్టుకుని ఆయన్ని తన తరపు వాదనలు వినిపించడానికి పిలిపించారు. ఇక బాబు తరపున ఆయన గట్టిగానే వాదించారు. కానీ ఏఐజీ సుధాకర్ కూడా లూథ్రాకు ధీటుగా కేసు తీవ్రతను వివరించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో బాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్ధానం. దీంతో బాబు గారు 14 రోజుల పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.
ఇక తన తరపున వాదించేందుకు సిద్ధార్థ్‌కు భారీగా ముట్టజెప్పారట చంద్రబాబు. సన్నిహితుల నుండి సమాచారం ప్రకారం లూథ్రా గంటకు రెండు గంటల ఛార్జ్ చేశారట. ఢిల్లీలోని తన ఇంటి నుండి బయలు దేరింది మొదలు కోర్టులో వాదనలు జరిగే ప్రతి సెకన్ కౌంటేనట. ఫీజు రూపంలో బాబు కోట్ల రూపాయలు వెచ్చించారని టాక్.దీంతో బాబుపై పలువురు న్యాయవాదులే సెటైర్లు వేస్తున్న పరిస్థితి. బెయిల్ పిటిషన్ కోసం కేవలం 15 నిమిషాలు తన వాదనను వినిపిస్తే సరిపోయే దానికి గంటల తరబడి వాదించడం వేస్ట్ అని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బెయిల్ వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఒక్కటి చాలు అవతలి వ్యక్తికి ఎంత క్రెడిబిలిటీ ఉన్నా బెయిల్ నిరాకరించడానికి. ఇక చంద్రబాబు కేసులో ఇదే జరిగిందని చెబుతున్నారు పలువురు న్యాయవాదులు. దీనికోసం బాబుకు కోట్ల రూపాయల నష్టంతో పాటు పరువు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పుకొస్తున్నారు.
