బీజేపీకి సుమలత మూడు షరతులు

- Advertisement -

కర్ణాటకలో స్వతంత్ర ఎంపీగా సుమలతను తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారా ? తాను చేరాలంటే మాత్రం….. అంటూ సమలత కొన్ని కండీషన్లు పెట్టారా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. గత ఎన్నికల్లో మండ్య నుంచి కాంగ్రెస్‌, జేడీఎస్‌ఉమ్మడి అభ్యర్థిగా అప్పటి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ బరిలో దిగారు. అక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేసిన సుమలతకు బేషరతుగా బీజేపీ మద్దతు పలికింది.

సుమలత కోసం బీజేపీ అక్కడి నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దాంతో ఆమె విజయం సాధించారు. ఇక 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మండ్యా జిల్లా నుంచి కనీసం నాలుగు స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు కమలనాథులు. దాంతో సుమలతను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇదే మంచి సమయం అని భావిస్తున్నారు. సుమలత సైతం బీజేపీలో చేరేందుకు సానుకూలంగానే ఉన్నాయి.

- Advertisement -

అయితే అందుకు 3 షరతులు విధించినట్లు సమాచారం. బీజేపీలో చేరాలంటే తనకు కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇవ్వాలనీ తన కుమారుడు అభిషేక్ కు మద్దూరులో టికెట్ కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. దీంతో పాటు మండ్య జిల్లా టికెట్ల పంపిణీలో స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఈ షరతులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

కాంగ్రెస్ కు పీకే ఊహించని షాక్

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్

కమ్మ మంత్రులపై కుట్రలు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -