Friday, April 26, 2024
- Advertisement -

కాంగ్రెస్ కు పీకే ఊహించని షాక్

- Advertisement -

కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్త ఊహించని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరాలంటూ ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు. కేవలం కాంగ్రెస్ సలహాదారుగా మాత్రమే కొనసాగుతానంటూ ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. కాంగ్రెస్ లో పీకే చేరబోతున్నారంటూ ఇటీవల కాలంలో బాగా ప్రచారం జరిగింది. పీకే కూడా మూడు నాలుగు సార్లు సోనియా గాంధీని కలవడం, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికలను కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు.

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ఈపీజీ లో చేరాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు ఆహ్వానించారు. అయితే అందుకు పీకే ససేమిరా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తనకంటే పటిష్ట నాయకత్వం అవసరమంటూ పీకే ట్వీట్ చేశారు. పార్టీలో ఏళ్ల తరబడి సంస్థాగతంగా నాటుకుపోయిన సమస్యలను సంస్కరణల ద్వారా పరిష్కరించకోవాలని పేర్కొన్నారు.

పీకే పార్టీ చేరిక అంశంపై అటు కాంగ్రెస్ పార్టీ సైతం అధికారికంగా స్పందించింది. ఏఐసీసీ ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈపీజీలో చేరాలన్న తమ ఆహ్వానాన్ని పీకే తిరస్కరించినట్లు వెల్లడించారు.

సీపీఎస్ పై జగన్ సర్కార్ యూటర్న్

కమ్మ మంత్రులపై కుట్రలు

ఏపీ నిధుల దారి మళ్లింపుపై సుప్రీం సీరియస్

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -