Friday, April 19, 2024
- Advertisement -

మరో సారి బయట పడిన లోకేష్ లెగ్గుమహిమ….విశాఖ టీడీపీలో వికెట్ ఢమాల్..

- Advertisement -

టీడీపీ భావి నేతగా లోకేష్ ను చూడాలనుకుంటున్న బాబు ఆశలు ఇప్పట్లో నెరవేరేటట్లు లేవు. గతంలో భావి ముఖ్యమంత్రిగా కూడా ప్రచారంలోకి వచ్చారు. అయితే లోకేష్ మాత్రం బాబ పెట్టుకున్న అంచనాల్ని అందుకోలేకపోయారు. ఎమ్మెల్సీ ద్వారా మంత్రిని చేశారో అప్పటినుంచె టీడీపీ గ్రాఫ్ పడపోతూ వచ్చిందనే విమర్శలు వచ్చాయి.

తెలుగుదేశం పార్టీలో నంబర్ టూ గా ఉన్న లోకేష్ తాను స్వయంగా మంగళగిరిలో ఓటమిపాలవడం ఆపార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భావి సీఎంగా ఫోకస్ అయిన లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడంతో ఆయనపై నాయకులకు నమ్మకం పోయింది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ట్విట్టర్ కే పరిమితం అయని లోకేష్ మొదటి సారి ప్రజల్లోకి వచ్చారు.

తాజాగా ఆయన విశాఖ జిల్లా పర్యటన ఎంచుకున్నారు.చినబాబు విశాఖ ఎయిర్ పోర్టులో దిగాడో లేదో.. ఈలోగా అక్కడ వికెట్ పడింది. నర్సీపట్నంలోని కీలక తెలుగుదేశం నాయకుల్లో ఒకరు.. మాజీమంత్రి అయ్యన్న పాత్రుడికి తమ్ముడు అయిన సన్యాసి పాత్రుడు.. పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పది మంది కౌన్సిలర్లు కూడా రాజీనామా చేశారు.

రాను రాను టీడీపీమీద కేడర్ కు నమ్మకం పోతోంది.ఎమ్మెల్యేలుగా గెలిచినవారు పార్టీ మారడానికి అనర్హత వేటు గురించి భయపడుతూ ఉన్నారే తప్ప… ఓడిపోయిన వాళ్లు, సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరికి వారు తమదారి తాము చూసుకునే ఉద్దేశంతోనే ఉన్నారు. విశాఖకు చెందిన అడారి దంపతులు కూడా తెలుగుదేశానికి రాజీనామా చేసేసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.

టీడీపీలో తగిన విలువ గౌరవం లేదని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా సన్యాసిపాత్రుడు చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీ వైపు చూస్తునట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఇప్పటికే రూరల్ జిల్లాలో బలమైన విశాఖ డైరీ కుటుంబం వైసీపీలో చేరిపోయింది. ఇపుడు మరోబలమైన నాయకుడు, స్వయానా మాజీ మంత్రి సోదరుడు అయిన సన్యాసిపాత్రుడు తన వర్గంలో టీడీపీకి గుడ్ బై కొట్టడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -