Monday, May 6, 2024
- Advertisement -

బాబు ప్ర‌యత్నాలు విఫ‌లం … గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన జ‌గ‌న్..

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలోకి వ‌స‌లు జోరు కొన‌సాగుతోంది. తాజాగా టిడిపిలోని సీనియర్ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ తీర్థం పుచ్కుకొనేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈనెల 14న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

జ‌గ‌న్ తో భేటీ అయిన ఆయ‌నకు గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో పార్టీ మార‌డం ఖాయం అయ్యింది. ర‌వి వైసీపీలో చేరుతున్నార‌నే స‌మాచారంతో అప్ర‌మ‌త్త మ‌యిన చంద్ర‌బాబు చేజారిపోకుండా ఉండేంఉద‌కు చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేశారు. దాంతో వారిద్దరి మధ్యా ఏం జరిగిందో తెలీదు కానీ తాను టిడిపిలోనే ఉంటానంటూ మీడియా ముందు రవి ఓ ప్రకటన చేశారు.

ఇంతలో పార్టీలో మళ్ళీ ఏం జరిగిందో తెలీదుగాని సోమవారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్నజగన్ తో రవి భేటీ అయ్యారు. భేటీ త‌ర్వాత పార్టీలో మార‌డానికి అంగీక‌రించారు. ర‌వి వైసీపీలోకి వెల్ల‌కుండా శ‌తావిధాల ప్ర‌య‌త్నించారు కాని బాబు ప్ర‌య‌త్నాలు ఫిలించ‌లేదు. పార్టీ మార‌డానికే య‌ల‌మంచిలి ర‌వి నిర్న‌యించుకున్నారు.

విజ‌య‌వాడ‌లో టీడీపీకి ఇదిపెద్ద ఎదురుదెబ్బ‌గా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం మారుతున్న రాజ‌కీయాల్లో ఏ ఒక్క‌రు చేజారినా ఆ త‌ర్వాత ప‌లువురు నేత‌లు పార్టీ మార‌డానికి సిద్ధ‌ప‌డ‌తార‌నే సందేహం టీడీపీ శ్రేణుల్లో ఉంది. పాద‌యాత్ర ముగిసే లోపు మ‌రింత మంది టీడీపీ కీల‌క నేత‌లు పార్టీలో చేరే అవ‌కాశం ఉండ‌టంతో వ‌ల‌స‌ల‌ను ఎలా ఆపాల‌ని టీడీపీ నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -