Monday, May 6, 2024
- Advertisement -

సోషల్ మీడియా వేదికగా వైసీపీని ఇరుకున పెట్టే విధంగా అధికార పార్టీ కార్య‌క్ర‌మాలు

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి వైసీపీకి శ‌రాఘాతంగా మారింది. అధికార‌పార్టీనాయ‌కుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పుకోలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది. పార్టీ అధినేత జ‌గ‌న్‌తోపాటు ఇత‌ర నాయ‌కులు అంద‌రు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ఇప్ప‌టికే తీవ్ర నిరాశ‌లో ఉన్న ఆ పార్టీ నాయ‌కుల‌ను మ‌రింత కుంగ‌దీసేందుకు బాబు కొత్త మైండ్‌గేమ్ మొద‌లు పెట్టారు.

వైసీపీ సోషియ‌ల్ మీడియాకు ధీటుగా టీడీపీ కూడా సోషియ‌ల్ మీడియాను మొద‌లు పెట్టింది. దీని ద్వారా వైసీపీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గ‌త రెండు మూడు రోజుల‌నుంచి ఆ పార్టీలోని ప‌దిమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వ‌స్తున్నార‌నె ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. కడ‌ప జిల్లాకు చెందిన ముఖ్య‌నేత ఆధ్వ‌ర్యంలో రహస్య సమావేశం జరిగిందన్నది ప్రచారం వైర‌ల్‌గా మారింది.

నంద్యాల ఓటమి అన్నది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే అనటంలో సందేహం లేదు. అదేవిధంగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిగాయి. దాని ఫలితం రావాల్సి వుంది. ఇక్కడ కూడా తేడా కొడితే ఇబ్బంది మరింత పెరుగుతుంది. ఒక ఎన్నిక రాయలసీమలో జరిగితే, మరో ఎన్నిక కోస్తా ప్రాంతంలో జరిగింది. కాకినాడ‌లో కూడా వైసీపీకి ఫ‌లితం వ్య‌తిరేకంగా వ‌స్తె ….రెండు ప్రాంతాల్లోను ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని టీడీపీ త‌న ప్ర‌చారాన్ని మ‌రింత ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తుంది.

వైసీపీ నుండి ఎంఎల్ఏలు వెళ్ళిపోతారా లేదా అన్నది పక్కనపెడితే పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించాలి. ఇప్పటి నుండే బలమైన అభ్యర్ధులను గుర్తించటం, ప్రతిపక్షం బలహీనతలపై అధ్యయనం చాలా అవసరం. మ‌రి జ‌న‌గ్ ఎలాంటి నిర్న‌యాలు తీసుకుంటారో దానిమీద‌నె పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -