Wednesday, April 24, 2024
- Advertisement -

మ‌హానాడుకు డుమ్మా..వైకాపాలో చేరకుండా బాబు పాట్లు….మహానాడులో రచ్చ

- Advertisement -

మహానాడు పేరుతో 2019 ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించాలనుకున్న చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఏకంగా అధికారంలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేనే పార్టీని వీడి వైకాపాలో చేరాలని నిర్ణయించుకోవడం టిడిపి నేతలను కూడా హతాశులను చేసింది. కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే మహానాడుకు డుమ్మాకొట్టారు. వైకాపాలో చేరాలన్న ఉద్ధేశ్యంతో ఉన్న బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే బిసీ జనార్థనరెడ్డి స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి ఆహ్వానించినప్పటికీ మహానాడుకు రావడానికి ఇష్టపడలేదు. పార్టీని వీడడం ఖాయం అని తేల్చిచెప్పాడు.

అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ తనను, తన నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపానపోలేదని …….కనీసం జనంలోకి వెళ్ళాలంటే కూడా భయపడేలా చేశారని…..టిడిపిలో ఉండడం తనకు ఇష్టం లేదని బాబుతోనే చెప్పేశాడు జనార్థన్‌రెడ్డి. దాంతో ఎన్నికల ఏడాదిలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే పార్టీని వీడిపోతే ఆ ప్రభావం పార్టీపై బలంగా పడుతుందని భయపడ్డ చంద్రబాబు టిడిపి సీనియర్ నేతలందరినీ మహానాడులోనే తిట్టిపోశాడు. కనీసం ఒక ఎమ్మెల్యే టిడిపిని వీడి వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్న విషయాన్ని మీరు ఎందుకు పసిగట్టలేకపోయారని, ఏం చేస్తున్నారని రచ్చ రచ్చ చేశాడు చంద్రబాబు.

సీనియర్ నేతలతో పాటు, చంద్రబాబు కోసం వేగుల్లా పనిచేసే జనాలను కూడా చంద్రబాబు తిట్టిపోశాడన్న వార్తలు వస్తున్నాయి. మహానాడు మొదటి రోజునే ఆనందం లేకుండా చేశారని…….ఎలా అయినా జనార్థనరెడ్డిని ఒప్పించి తర్వాత రెండు రోజులకు అయినా మహానాడుకు వచ్చేలా చేయాలని…….అవసరమైతే మంత్రి వర్గ విస్తరణలో జనార్థనరెడ్డిని మంత్రిని చేయడానికి కూడా సిద్ధమని చంద్రబాబు మాటగా జనార్థనరెడ్డికి చెప్పమని ఆదేశించాడు చంద్రబాబు.

అధికారంలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే పార్టీని వీడడం కచ్చితంగా 2019 ఎన్నికల్లో టిడిపికి చాలా పెద్ద దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో జనార్థనరెడ్డి వైకాపాలో చేరకుండా చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -