Thursday, May 9, 2024
- Advertisement -

బాబు అభివృద్ధి గ్రాఫిక్స్……. ఉతికి ఆరేసిన టిడిపి సీనియర్ నేత

- Advertisement -

ఒకవైపు చంద్రబాబేమో సౌత్ ఇండియా-నార్త్ ఇండియా అంటూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు. దేశంలోనే సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే నాయకుడు దేశ సమగ్రతకు భంగం వాటిల్లే ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతాడో ఆయనకే తెలియాలి. దక్షిణ భారతదేశం విషయంలో మోడీ వివక్ష చూపిస్తున్నాడని విమర్శిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడి టిడిపి సీనియర్ నాయకుడి నుంచి దిమ్మతిరిగే కౌంటర్స్ పడ్డాయి. అసలు చంద్రబాబుకు మోడీని విమర్శించే అర్హత ఉందా అని అనిపించే స్థాయిలో విమర్శలు ఉన్నాయి.

విభజన పర్వం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవుతుంది అని పేరు తెచ్చుకున్న జిల్లా ప్రకాశం. ఇక్కడ టిడిపిని కూడా బాగానే ఆదరించారు ప్రజలు. కానీ టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం ప్రకాశం జిల్లాను పూర్తిగా గాలికొదిలేశారు చంద్రబాబు. ఈ విషయాన్ని టిడిపి సీనియర్ నేత కరణం బలరాం ఆవేదనగా చెప్పుకొచ్చాడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో…… ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లో ప్రకాశం జిల్లా ఉందనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? అని చంద్రబాబుపై విరుచుకుపడిపోయాడు కరణం. నాలుగేళ్ళుగా కనీస స్థాయి అభివృద్ధి కూడా లేదని, ప్రకాశం జిల్లాను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశాడని చెప్పుకొచ్చాడు. ఒక్క పరిశ్రమను కూడా చంద్రబాబు తీసుకురాలేకపోయారని కరణం విమర్శలు చేశాడు. చంద్రబాబు అధికారంలోకి రాబట్టే ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కాలేదని చెప్పి ఇప్పటికే ఆవేధనతో ఉన్న ప్రకాశం జిల్లా ప్రజలకు ఇప్పుడు సాక్షాత్తూ టిడిపి నాయకుడే బాబు అభివృద్ధి గ్రాఫిక్స్ బండారాన్ని కూడా బయటపెట్టేశాడు. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలు చాలా వాటిలో ప్రకాశం జిల్లాలో ఈ సారి వైకాపా స్వీప్ ఖాయం అని తేల్చి చెప్పారు. ఇప్పుడిక ఎన్టీఆర్ హయాం నుంచీ ఉన్న టిడిపి సీనియర్ నాయకుడు కరణం బలరాం వ్యాఖ్యలు టిడిపికి చాలా డ్యామేజ్ చేస్తాయనడంలో సందేహం లేదు. ఒకవైపు ఢిల్లీలో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు అభివృద్ధి మాయను పూర్తిగా ప్రజలకు వివరిస్తూ ఉండడం……చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి అంతా డొల్ల అని తేల్చి చెప్తూ ఉండడం మాత్రం చంద్రబాబులో కలవరపాటును పెంచే విషయమే అనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -