Wednesday, May 8, 2024
- Advertisement -

ఎంపీగా విఫలమయ్యా…2019లో కూడా టీడీపీదే విజయం…

- Advertisement -

టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏదో ప్ర‌తిప‌క్షాన్ని విమ‌ర్శించ‌డ‌మో కాదు ఏకంగా త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. ఎంపీగా తాను ఫెయిల్ అయ్యానని తన మనస్సాక్షి చెబుతోందని ఆయన అన్నారు.

సోమవారం లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్లి, లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖను అందిస్తానని చెప్పారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలోని చాగల్లు రిజర్వాయర్ కు నీరు కూడా తీసుకురాలేని తనకు ఎంపీ పదవి ఎందుకని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకే రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు.

జెసి రాజీనామా ప్రకటన చేయటంతో టిడిపిలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది. జెసి తన పదవికి రాజీనామా చేస్తారంటూ కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నప్పటికీ అదంతా ఉత్త ప్రచారమే అనుకున్నారు. అయితే, స్వయంగా రాజీనామా గురించి జెసినే ప్రకటించటంతో పార్టీలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. నిజానికి అభివృద్ధి పనులు చేయలేకపోతుండటమే రాజీనామాకు కారణమైతే చాలా మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిందే అనటంలో ఎవరికీ సందేహాలు లేదు. కానీ జెసి విషయం వేరు. ఎందుకంటే, అనంతపురం టిడిపి ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరితో ఆయనకు ఏమాత్రం పడటం లేదు.

ఈ విషయంలో చంద్రబాబునాయుడు ముందు ఎన్నిసార్లు పంచాయితీ జరిగినా ఉపయోగం లేకపోయింది. దానికితోడు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువమంది జెసికి పూర్తిగా వ్యతిరేకం. దాంతో ఒక్క పని కూడా జెసికి కావటం లేదు. అదంతా మనసులో పెట్టుకున్న జెసి చివరకు రాజీనామా చేయటం ఒకటే మార్గంగా అనుకున్నారు. రాజీనామాకు క‌ట్టుబ‌డ‌తారో లేదో చూడాలి. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఎప్పుకుంటారా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -