Thursday, May 2, 2024
- Advertisement -

ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు షాక్‌….పార్టీకీ రాజీనామా చేసిన సీనియ‌ర్‌ నేత‌

- Advertisement -

మ‌రో నాలుగు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లు టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల‌కు క‌త్తిమీద సాములాంటివే. జ‌న‌సేన పార్టీని అటుంచితే …వైసీపీకీ మాత్రం చావో రేవో అన్న‌ట్లుగా ఉంది. 2014 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ …ఈ సారి అలాంటి పొర‌పాట్లు లేకుండా వ్యూహాత్మ‌కంగా ముందుకెల్తోంది. ఇత‌ర పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన నాయ‌కులను పార్టీలో చేర్చ‌కుంటూ ముందుకు వెల్తున్నారు జ‌గ‌న్

ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి జంపింగ్‌లు భారీగో జోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ‌గా ఇత‌ర పార్టీల‌నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగ‌తున్నాయి. ఇక క‌ర్నూలు జిల్లాలో వైసీపీకీ మంచి ప‌ట్టుంది. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌ని బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసి కొడ్తుతున్నాయి. వైసీపీ నుంచి గెలిచిన అఖిల‌ప్రియ టీడీపీలోకి ఫిరాయించి మంత్రిగా కొన‌సాగుతున్నారు. అయితే సీనియ‌ర్ నాయ‌కుల‌కు మంత్రి అఖిల వైఖ‌రి న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆమెపై గుర్రుగా ఉన్నారు.

ఏవీ సుబ్బారెడ్డి , అఖిల మ‌ధ్య‌నున్న విబేధాలు అంద‌రికీ తెలిసిందే. ఇద్ద‌రూ ఉప్పు, నిప్పులా ఉన్నారు. ఇద‌లా ఉంటే..తాజాగా ఆళ్లగడ్డలో టీడీపీకీ భారీ షాక్‌ తగిలింది. అఖిల ప్రియ వైఖ‌రి న‌చ్చ‌క సీనియ‌ర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి పార్టీకీ రాజీనామా చేశారు. ఆయ‌న వైసీపీలో చేరే యోచనలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

శనివారం ఆళ్లగడ్డలో అనుచరులతో సమావేశమైన టీడీపీ నేత రాంపుల్లారెడ్డి ఈ మేరకు వారితో సంప్రదింపులు జరిపారని, వైసీపీలో రాజకీయ భవితవ్యంపై చర్చించారని తెలిసింది. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్లు స‌మాచారం.

ప్రభుత్వ పథకాల్లో మంత్రి అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆయ‌న‌ ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందించ‌లేద‌ని వాపోయారు. టీడీపీ అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. నీరు చెట్టు పథకంలో అఖిల ప్రియ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధం అని తెలిపారు. ఇరిగెల బాటలోనే పలువురు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో అనూహ్య మార్పులు వస్తుంటాయి. పాతవారు పోవడం, కొత్తవారు రావడం ప్రతి ఎన్నికల ముందు సహజమే. అయితే సాధార‌నంగా ప్ర‌తిప‌క్ష పార్టీనుంచి అధికార పార్టీలోకి వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే ఇక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. అధికార టీడీపీనుంచి ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌లు అధికంగా ఉన్నాయి. కాగా అసలేం జరగుతుందనేది మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -