Friday, April 26, 2024
- Advertisement -

బెజవాడ లో టీడీపీ నేతలు ఇలా కొట్టుకుంటున్నారేంటి…!!

- Advertisement -

టీడీపీ పరిస్థితి ఎంత అయోమయంగా ఉందంటే పార్టీ అసలు ఏపీలో ఉన్నట్టా లేనట్టా అన్నట్లు తయారైంది.. చంద్రబాబు మినహా ఏ నాయకుడు కూడా బయటికి వచ్చి మాట్లాడనిన దాఖలాలు కనపడట్లేవు.. ఇదిలా ఉంటే అసలే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు టీడీపీ లో అంతర్గత కుమ్ములాట పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీసేలా ఉంది.. పార్టీ ఏమైతేనేం తమకు కావాల్సింది తమ సొంత ప్రయోజనాలు అన్నట్లు ఆయా నేతల తీరు కనపడుతుంది..

ఇక విజయవాడ లో టీడీపీ లో నేతల మధ్య ఉన్న విద్వేషాల సంగతి తెలిసిందే. అక్కడ బలమైన లీడర్ లు ఉండడం తో ఒకరితో ఒకరికి అస్సలు పడడం లేదు.. పైగా జగన్ మేనియా లో కూడా అక్కడ టీడీపీ కే ఎక్కువ స్థానాలొచ్చాయి. విజ‌య‌వాడ ఎంపీ సీటుతో పాటు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండాయే ఎగిరింది. గద్దె రామ్మోహన్ తూర్పు నియోజక వర్గంలో వరుసగా విజయం సాధించగా, విజయవాడ ఎంపీ సీటు ను కేశినేని నాని దక్కించుకున్నాడు.. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం పాతిక ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా ఓడిపోయారు..

అయితే మేయర్ పీఠం పై ఆశపడ్డ బోండా ఉమా కు కేశినేని కూతురు శ్వేతా రూపంలో అయన అడ్డంకి మొదలైంది.. దాంతో అప్పటివరకు రెండు వర్గాలు గా ఉన్న విజయవాడ టీడీపీ ఇప్పుడు మూడు వర్గాలు గా విడిపోయింది.. మేయ‌ర్ పీఠంఎక్కడానికి త‌న స‌తీమ‌ణిని నిల‌బెట్టాల‌ని బొండా ఉమా గ‌ట్టిగా ప్రయ‌త్నించారు. కానీ, కేశినేని మాత్రం త‌న కుమార్తె శ్వేత‌ను రంగంలోకి దింపారు. దీనిపై ఇరు ప‌క్షాల మ‌ధ్య రాయ‌బారాలుకూడా న‌డిచాయి. అయిన‌ప్పటికీ.. నాని మాత్రం వెన‌క్కి త‌గ్గలేదు. దాంతో బోండా ఉమా వేరే కుంపటి పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.. దీనికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహకరిస్తున్నారని తెలుస్తుంది.. ఇదే మేయర్ విషయంలో ఎంపీ నాని కి, గద్దె రామ్మోహన్ కి పడట్లేదని విజయవాడ లో కోడై కూస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చంద్రబాబు ఎలా చక్కబెడతాడో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -