రేవంత్‌రెడ్డి ఇళ్లు, ఆయన సన్నిహుతుల కార్యాయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, కేసీఆర్ లు ఇద్దరు కుమ్మక్కై తనపై కుట్రలు పన్నుతున్నారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై మూడు రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులతో సోదాలు చేయించి ఏం సాధించారని తె ప్రశ్నించారు.
మళ్ళీ అధికారంలోకి రావాలన్న దుర్భుద్దితో కేసీఆర్ మరో నాటకానికి తెరతీశాడని రేవంత్ విమర్శించాడు. అయితే కేసీఆర్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. తెలంగాలణలో జరిగే ఎన్నికలు కేసీఆర్, చంద్రబాబుల మధ్యే అంటూ మరోసారి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈసారి ఎన్నికలు టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్నే అని రేవంత్ స్పష్టం చేశారు.
ఓటుకు నోటు కేసు విషయంలో ముందు తనను దాటాకే ఎవరి జోలికైనా వెళ్లాల్సి ఉంటుందన్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో కెల్లా కేసీఆర్ అధముడని ఘాటుగా విమర్శించారు. సఎం పదవి పోతుందన్న భయంతోనే కేసీఆర్ నీచంగా వహరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్ కు అమరావతికి వెళ్లినపుడు ఆ విషయం గుర్తుకురాలేదా అని రేవంత్ ప్రశ్నించారు.
