Friday, April 26, 2024
- Advertisement -

జిఎస్టి పెరుగుదల..మోడీకి ఎఫెక్టే ?

- Advertisement -

నరేంద్ర మోడి అధికరంలోకి వచ్చిన తరువాత ఎన్ని సరికొత్త విధాననలను ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రవేశపెట్టిన విధానమే జిఎస్టి ( వస్తు సేవల పన్ను ). గతంలో విడివిడిగా వసూలు చేసే పన్ను విధానాన్ని రద్దు చేసి.. వాటి స్థానంలో జిఎస్టి ని ప్రవేశ పెట్టారు. ఈ జిఎస్టి ద్వారా అన్నీ రకాల పన్నులను ఒకే పద్దతిలో వసూలు చేయవచ్చు. 2016 లో ప్రవేశపెట్టిన ఈ జిఎస్టి విధానంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకతనే వచ్చింది. అయితే ఆ తరువాత జిఎస్టి అనేది సర్వసాధారణం అయిపోవడంతో దీని గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. కానీ మరోసారి కేంద్రం జిఎస్టి ని హాట్ టాపిక్ గా మార్చింది. ఇటీవల జిఎస్టి పన్ను ను 5% దాకా పెంచడంతో సామాన్యులపై అదనపు ధరల భారం పడనుంది.

పెరిగిన జిఎస్టి పన్నులు జూలై18 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పెరిగిన జిఎస్టి ధరలతో నిత్యవసర వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. ఇదిలా ఉంచితే ప్రధాని మోడి జిఎస్టి పేరుతో విపరీతంగా పన్నులను వసూలు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం హటాత్తుగా జిఎస్టి టాక్స్ పెంచడం వెనుక అసలు కారణంపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా భారీగా తగ్గిపోయాయి.

దాంతో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్షీణించింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ తో మన రూపాయి విలువ రూ.80 కి చేరింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థితిలో ఉందనే విషయం. దాంతో మనదేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పన్నులు కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇలా నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. ఇది రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఎఫెక్ట్ గా మారే అవకాశం ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

More Like This

సోనియా గాంధీపై సానుభూతి వస్తుందా ?

వరదల ముప్పు .. టి‌ఆర్‌ఎస్ కు చెక్ ?

వారి సైలెన్స్ వెనుక.. కారణం ఆదేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -