Sunday, May 19, 2024
- Advertisement -

దశాబ్దాల చరిత్ర ఒక్క దెబ్బతో మటాష్‌

- Advertisement -

తెలంగాణాలో టీడీపీ ప‌రిస్థితి చివ‌రి ద‌శ‌కు చేరింది. తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని గమనిస్తే మూడేళ్లలో ఆ పార్టీ పరిస్థితి ఎలా తయారైందో గమనిస్తే.. ఇది తెలుగుదేశానికి తెలుగుదేశం చేసుకున్న ఆత్మహత్య అని చెప్పక్కతప్పదు. పార్టీ అధినేత చేసిన త‌ప్పు తో ఇప్పుడు పార్టీ తుడుచిపెట్టుకొని పోయో ప‌రిస్థితి వ‌చ్చింది.

టీడీపీ చేసిన ఒక చిన్న వ‌క్ర‌మార్గం….తెలంగాణాలో పార్టీ ప్ర‌తిష్ట‌త పాతాళానికి చేరింది. తెలంగాణలో తెలుగుదేశం చరిత్రను పోల్చిచూస్తే.. భవిష్యత్తు ప్రశ్నార్థకం అనడంకాదు, అసలు తెలుగుదేశం ఈ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయింది అని అనడానికి ఏ మాత్రం వెనుకాడనక్కర్లేదు.

విభ‌జ‌న‌తో కూడా తెలంగాణాలో టీడీపీ తుడుచి పెట్టుకొని పోయింది. హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా ప‌ది సంవ‌త్స‌రాలు ఉందికాబ‌ట్టి ఇక్క‌డే ఉండి పార్టీని గాడిలో పెట్టాల‌ని ప్ర‌య‌త్నించాడు. అయితె తెలంగాణలో టీడీపీకి బేస్‌ ఉన్న సమయంలో చంద్రబాబు పన్నిన ఒక విషవ్యూహం తెలుగుదేశం పార్టీకి ఆ రాష్ట్రంలో శాశ్వత సమాధి కట్టేసింది. ఎన్టీఆర్‌నె వెన్నుపోటు పొడిచి వంద‌మంది ఎమ్మెల్యేల‌ను మ్యానేజ్ చేసిన బాబు కేసీఆర్‌ను దెబ్బ‌కోట్ట‌లేనాని అతివిశ్యాసంతో కేసీఆర్‌తో త‌ల‌గోక్కోని చివిరికి పెట్టాబేడా స‌ర్ధుకొని ఏపీకి పారిపోయిన ఘ‌నుడు.

నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ను కొనే క్ర‌మంలో అడ్డంగా దొరికిపోయారు. అయితె కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని బాబు ప్రయత్నించాడని దాంతో కేసీఆర్‌ అలర్ట్‌ అయ్యాడని.. చంద్రబాబు కుట్రను అర్థం చేసుకుని.. పక్కా ప్రణాళికతో ఓటుకు నోటు ట్రాప్‌లోకి లాగి.. చంద్రబాబుకు ఝలక్‌ ఇచ్చాడని తెరాసా వాళ్లు గర్వంగా చెప్పుకుంటారు.

ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం నేతలు ఇరుక్కోవడం, నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు బాబు అని కేసీఆర్‌ హెచ్చరించడం, చివరకు ఎలాగో రాజీ ఫార్ములాను తయారు చేసుకోవడం.. చంద్రబాబు నాయుడు హుటాహుటిన హైదరాబాద్‌ను ఖాళీ చేసేయడం.. వంటి పరిణామాలుజ‌రిగిన విష‌యం తెలిసిందే. దీంతో అక్క‌డ పార్టీ ప‌త‌నావ‌స్థ ప్రారంభ‌మ‌య్యింది.

ఇప్పుడు రేవంత్ రెడ్డితో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది. రేవంత్‌ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు వెళ్లిపోతే.. తెలుగుదేశం పార్టీ పతనంలో మరో అంకం ముగిసినట్టే. కేవలం రేవంత్‌ రెడ్డి మాత్రమే కాదు.. దశాబ్దాల పాటు టీడీపీకి అండగా నిలిచి, ఈ పార్టీనే పట్టుకుని అండగా నిలబడిన వాళ్లంతా కూడా ఇప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు.తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయినట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -