కేసీఆర్ కుటుంబాన్ని అంబేద్కర్ విగ్రహానికి కట్టేస్తా

- Advertisement -

జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌ కుమార్‌ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరణ్ చుగ్‌ మల్లన్నకు పార్టీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు. మల్లన్నకు బీజేపీ సభ్యత్వ రశీద్‌ అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మల్లన్న యాత్రకు నిరుద్యోగులు, ప్రజలు బ్రహ్మరధంపట్టారని ఆయర గుర్తు చేశారు.

పార్టీలో చేరిన మల్లన్న కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తాను పార్టీ సభ్యత్వం తీసుకోగానే 15 మీటర్ల తాడు కొన్నానని, ఆతాడుతోనే కేసీఆర్‌ కుటుంబాన్ని అంబేద్కర్ విగ్రహానికి కట్టేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ చేస్తున్న అక్రమాలు ప్రజలకు చూపించినందుకు కేసీఆర్ తనపై అక్రమంగా 38 కేసులు పెట్టించారన్నారు. ఇంతకు ముందు కేసీఆర్‌పై తాను ఒక్కడినే పోరాడేవాడినని, ఇప్పుడు తనకు చాలా గొంతులు తొడాయ్యయని పేర్కొన్నారు.

- Advertisement -

కేసీఆర్‌పై బండి సంజయ్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్‌ మల్లన్న నిజాన్ని ప్రజలకు చూపినందుకు అక్రమంగా కేసులు భనాయించిన ఘనత మన ముఖ్యమంత్రిదన్నారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రగతి భవన్‌లో ఫుల్‌గా తాగినప్పుడే కేసీఆర్‌ మీడియా ముందుకు వస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది

రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు ఎక్కువయ్యాయి

టార్గెట్ రఘురామ కృష్ణంరాజు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -