Saturday, April 20, 2024
- Advertisement -

విజయశాంతి నోరు కట్టేస్తున్న నేతలెవరూ ?

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో విజయ శాంతి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. కే‌సి‌ఆర్ తో కలిసి రాష్ట్ర సాధనకై క్రియాశీలకంగా పోరాడిన ఆమె కు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉండేది. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత టి‌ఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పిన విజయశాంతి.. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు..కాంగ్రెస్ లో కొంతకాలం ఉన్న ఆమె కొన్ని కారణాల వల్ల హస్తం పార్టీకి కూడా గుడ్ బై చెప్పి కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక ఆ తరువాత 2020 లో బిజెపి గూటికి చేరారు. అయితే ఆమె బీజేపీలో చేరినప్పటికి పార్టీ పరంగా మొదట్లో కాస్త యాక్టివ్ గా ఉన్నప్పటికి మెల్లమెల్లగా ఆమె పార్టీ కార్యకలాపాలలో కనుమరుగౌతు వచ్చింది. ఇక తాజాగా ఆమె ఈ విషయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పోలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి.

ఆమెకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అందుకే ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ” పార్టీలో తన పాత్ర లేకుండా చేసిన వారిని పాతరేయ్యాలి ” అంటూ విజయశాంతి వ్యాఖ్యానించడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఇంతకీ పార్టీలో ఆమె పాత్రను తగ్గిస్తున్నది ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

అయితే విజయశాంతి తరువాత పార్టీలో చేరిన ఇతర పార్టీ నేతలు ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి వారికి పార్టీలో మంచి ప్రాధాన్యం కల్పించారు కానీ విజయశాంతికి మాత్రం బీజేపీలో సభ్యత్వం తప్ప వేరే ఇతర అధికారం లేదు. దీంతో మెల్లమెల్లగా ఆమెను పార్టీలోనుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అను అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ తీరుపై రాములమ్మ అలకపునడం బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరి రాములమ్మ అలకను గ్రహించి పార్టీలో ప్రాధాన్యం ఇస్తారా ? రాములమ్మను కమలనాథులు లైట్ తీసుకుంటారా ? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : రేపిస్టులకు అండగా మోడీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -