Saturday, April 27, 2024
- Advertisement -

రేపిస్టులకు అండగా ఉండడం మోడీ నైజమా ?

- Advertisement -

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం 11 మంది రేపిస్టులను జైల్ నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతు వస్తోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మొదట్లో ఈ నిర్ణయం పట్ల ఆచితూచి స్పందించిన ఇతర పార్టీల నేతలు ఇప్పుడు వ్యతిరేక స్వరాన్ని రెట్టింపు చేస్తూ వస్తున్నారు. గత రెండు రోజుల క్రితం దీనిపై స్పందించిన తెలంగాణ మంత్రి కే‌టి‌ఆర్ “గుజరాత్ సర్కార్ రేపిస్టులను రిలీజ్ చేయడం వికారంగా ఉందంటూ ” ఘాటుగా స్పందించారు.

అంతే కాకుండా రేపిస్టులకు కఠిన శిక్షలు అమలు చేయాలని, ఆదిశగా ఐపీసీ చట్టాలు చేయాలని ” ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక తాజాగా ఏంఐఏం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా గుజరాత్ సర్కార్ తీరుపై ఘాటుగానే స్పందించారు. ” ఇదే ప్రధాని మోడీ నారీ శక్తి ఎజెండా.. రేపిస్టుల వైపు నిలబడడం బీజేపీ నైజం.. తల్లిని గ్యాంగ్ రేప్ చేసి చిన్నారిని చంపడం మంచి సంస్కరమా ? తీవ్రమైన నేరాలకు పాల్పడిన దొషులను విడిచిపెడుతున్నారు. కనీసం గాడ్సే నైనా ఊరి తీసినందుకు ఆ దేవుడికి ఋణపడి ఉండాలి ” అని ఒవైసీ ట్వీట్ చేశారు.

2002 లో గుజరాత్ లో జరిగిన గోద్రా ఘటన తర్వాత బల్కిన్ బానో పై అమూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబానికి చెందిన ఎదుగురిని హత్య చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా అపట్లో పెను సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆ కేసులో దొషులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంతో దేశ వ్యాప్తంగా బీజేపీ తీరును ఎండగడుతున్నారు. ప్రధానిమోడీ, బీజేపీ ఆద్వర్యంలోని ” నవ భారతానికి నిజమైన రూపం ” ఇదే నంటూ సామాజిక సంఘాలు మండి పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -