Friday, April 26, 2024
- Advertisement -

జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తా!

- Advertisement -

గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి దూకుడుగా ఉన్న వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఇక నగర అధ్యక్షుడు.. వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తన పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రచారం జరుగుతోంది. తన రాజీనామా వ్యవహారంపై స్పందించారు. పార్టీ అంటే తనకు ప్రేమని.. ప్రాణం ఉన్నంతవరకు జగనన్న వెంటే నడుస్తానని తేల్చి చెప్పారు. పార్టీ ఎప్పుడూ తనకు అన్యాయం చేయలేదని, ఎప్పటిలాగే పార్టీ కోసం, జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తాను అన్నారు. 

విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం తరువాత.. మేయర్ పదవికి ఆశావాహుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా సీటు బీసీ జనరల్ కు రిజర్వ్ అవ్వడంతో అదే సామాజికి వర్గానికి చెందని కీలక నేతలంతా ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే నగర్ వైసీపీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ కు మొదటి నుంచి అధిష్టాం నుంచి హామీ ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మేయర్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నా.. ఆ పదవి దక్కపోవడంతో నగర వైసీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్ వంశీ కృష్ణ శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తానొక దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వేగానికి  లోనయ్యారు.

కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు.  జీవీఎంసీ మేయర్‌ పదవి దక్కలేదన్న కోపంతో.. పార్టీ నగర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ప్రచారాన్ని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు నమ్మొద్దన్నారు.

తన పేరుతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి వైఎస్సార్‌ సీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆరోపించారు. అలా చేసిన వారిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తల్లి వంటి పార్టీని, పెద్దల ప్రతిష్టకు భంగం కల్గించే చర్యలను పూర్తిగా ఖండిస్తున్నాను అన్నారు. నా జీవితం అంతమయ్యే వరకు జగన్ అన్న వెంటే ఉంటానన పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి గెలుపు!

వంద రోజుల్లోనే వేల కొద్దీ అనుమతులు: కేటీఆర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -