Friday, May 3, 2024
- Advertisement -

వంద రోజుల్లోనే వేల కొద్దీ అనుమతులు: కేటీఆర్..!

- Advertisement -

టీఎస్​ బీపాస్‌ ప్రారంభించిన వంద రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ శాసనసభలో వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి.. 600 గజాల వరకు దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్‌ అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లోనే ఆక్యూపెన్సీ సర్టిఫికెట్‌ జారీచేస్తున్నామని తెలిపారు.

హౌజింగ్‌ బోర్డులోని ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించామని కేటీఆర్‌ తెలిపారు. కేపీహెచ్​బీలో ఇళ్ల పునర్‌నిర్మాణానికి ఉచితంగా అనుమతులు కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేయగా.. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామకంఠం భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

కరెంట్‌ ఛార్జీల పెంపుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో మజ్లిస్‌ సభ్యుడు హసన్‌ జాఫ్రీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.కొవిడ్‌ సమయంలో రెండు డిస్కంలలో కలిపి 4వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని గుర్తుచేశారు. కరెంట్‌ ఛార్జీలు పెంచాల్సి వస్తే… తప్పకుండా ప్రజలకు చెప్పే చేస్తామని.. ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.

అథ్లెట్లకు కరోనా పాజిటివ్‌.. ప్రపంచకప్‌లో ముగ్గురు..

పోలీస్ స్టేషన్‌లో డబ్బు మాయం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానం పై.. కేటీఆర్ విజృంభణ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -