పవన్ను అందుకే టార్గెట్ చేస్తున్నారా ?

ఏపీలో జనసేన పార్టీ ఏర్పడి పదేళ్ళు కావొస్తున్న ఇప్పటివరకు పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందా ? అంటే చెప్పలేని పరిస్థితి. దీనికి కారణం ఏంటో కూడా అందరికీ తెలిసిందే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండకపోవడం, జనసేన పార్టీ ఎజెండా ఏంటో ఇంతవరకు ప్రజలకు తెలియకపోవడం, పార్టీలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం.. ఎలాంటి ఎన్నో కారణాలను తెరపైకి తీసుకొస్తారు విశ్లేషకులు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం ఏపీలో జనసేన ఫుల్ యాక్టివ్ గా ఉంది. పవన్ కూడా వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ” కౌలు రైతు భరోసా “, జనవాణి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

దీంతో జనసైనికుల్లో కొత్త జోష్ కనిపించడంతో పాటు ప్రజల్లో కూడా జనసేన ప్రభావం కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఇక పవన్ కు సహజంగానే అభిమానఘనం ఉండడంతో ఎక్కడ సభలు ఏర్పాటు చేసిన జనం తండోప తండాలుగా వస్తూ ఉండడం.. అధికార పార్టీకి మింగుడు పడని విషయం. దాంతో తరచూ విమర్శలు చేస్తూ పవన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ వర్గం. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. వైసీపీ పార్టీ ఇతర పార్టీ నేతలను టార్గెట్ చేసినప్పుడు వారి కులానికి సంబంధించిన నేతలనే రంగంలోకి దించడం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును తిట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన కొడాలినాని ని రంగంలోకి దించుతారు వైఎస్ జగన్.. అదే విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ను తిట్టాలంటే అదే కులానికి చెందిన పెర్ని నాని లైన్లోకి వస్తాడు.

ఈ విధంగా ఇతర నేతలపై విమర్శలు చేసే విషయంలో కుల సమీకరణాలను ఫాలో అవుతుంది జగన్ పార్టీ.. సరే ఈ విషయం అలా ఉంచితే.. ప్రస్తుతం పవన్ను టార్గెట్ చేసిన వైసీపీ వర్గం.. అంబటి రాంబాబు ను లైన్లోకి దించినట్లు తెలుస్తోంది. ఈ మద్య తరచూ అంబటి పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తరచూ చంద్రబాబును టార్గెట్ చేసే వైసీపీ ఈ సారి పవన్ను టార్గెట్ చేయడం వెనుక పోలిటికల్ స్ట్రాటజీ ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. పవన్ త్వరలో సి‌ఎం జగన్ సొంత జిల్లా కడపలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాడు. ఈ సభకు భారీ సంఖ్యలో జనాలు హాజరుకావడం ఖాయం. దాంతో పవన్ పై ఇప్పటినుంచే విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. అలాగే వచ్చే దసరా నుంచి బస్సు యాత్ర కూడా పవన్ చేపట్టబోతున్నాడు. అందువల్ల పవన్ ప్రణాళికలను దెబ్బకొట్టాలంటే పవన్ పై విమర్శల దాడి పెంచాలనే వ్యూహం వైసీపీ వర్గంలో ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే జనసేన పార్టీ విధానాలపై పవన్ను తరచూ వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

మోడీని దువ్వుతున్న బాబు..!

జగన్ను ఓడించాలంటే అదొక్కటే దారి ?

లోకేష్ కు యువత అండగా నిలుస్తుందా ?

Related Articles

Most Populer

Recent Posts