Wednesday, May 8, 2024
- Advertisement -

మోడీని దువ్వుతున్న బాబు..!

- Advertisement -

చంద్రబాబు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారో చెప్పడం కష్టం.. అపార చాణక్యుడిగా పేరున్న బాబు రాజకీయ వ్యూహాలు రచించడంలో సిద్దహస్తుడు అనే చెప్పాలి. పార్టీ బలహీనంగా ఉన్న ప్రతిసారి ఊహించని ప్రణాళికలు వేస్తూ పార్టీని తిరుగి గాడిలో పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో ఆయన రచించే వ్యూహాలకు ఇతర పార్టీల నాయకులు ముక్కున వేలేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు గత ఎన్నికల్లో చూసుకుంటే అప్పటివరకూ మోడీకి అనుకూలంగా ఉన్న బాబు.. ఊహించని రీతిలో మోడీపై విమర్శల దాడి ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.. అంతే కాకుండా మోడీకి వ్యతిరేకంగా ఎవరు ఊహించని విధంగా దేశంలోని విపక్ష పార్టీల నేతలను ఒకే తాటిపైకి తీసుకొచ్చారు.

అయినప్పటికి బాబు ప్రణాళికలు ఫలించకపోయిన మోడీకి వ్యతిరేకంగా బాబు చేసిన పోరాటం మాత్రం అప్పుడు హాట్ టాపిక్ గానే నిలిచింది. ఇక అప్పటినుంచి మోడీకి కేంద్ర ప్రభుత్వానికి దూరంగా ఉంటూ వస్తున్న బాబు.. హటాత్తుగా ఈ మద్య కాలంలో మోడీకి దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అడగకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపడం.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశంశలు కురిపించడం వంటివి చేశారు చంద్రబాబు. ఇలా చేయడంపై బాబు చాణిక్య వ్యూహాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దాంతో టీడీపీని తిరిగి గాడిలో పెట్టాలంటే.. 2014 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి రచించిన వ్యూహాలను మళ్ళీ అమలు చేసే ఆలోచనలో బాబు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే బాబు మోడీకి దగ్గరయ్యే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఇక తాజాగా మరోసారి మోడీ పరిపాలనపై బాబు ప్రశంశలు కురిపించడాన్ని బట్టి చూస్తే పొత్తు విషయంలో బీజేపీని ఆహ్వానించేందుకు తలుపులు తెరిచినట్లేనని కొందరి అభిప్రాయం. గుంటూర్ లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న బాబు.. మోడీ పరిపాలనను ఆకాశానికేత్తారు. ఏకంగా పీవీ నరశింహరావు, వాజ్ పేయి, నెహ్రూ లతో పొలుస్తూ మోడీపై ప్రశంశలు కురిపించారు. మోడీ విజన్ పై ఈ స్థాయిలో బాబు పొగడ్తలు కురిపించడంతో.. పొత్తు విషయంలో బాబు ఇస్తున్న సంకేతాలు అని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరి ఈ స్థాయిలో మోడీ ని దువ్వుతున్న బాబు వైకరిపై మోడీ కూడా అనుకూలత చూపుతున్నప్పటికి పొత్తు విషయంలో మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు.

Also Read

అతను మోడీకి దూరమైంది.. అందుకే ?

తప్పు.. ప్రభుత్వానిదా..ప్రతిపక్షాలదా ?

సర్వేల తీర్పు సమంజసమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -