లోకేష్ కు యువత అండగా నిలుస్తుందా ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తండ్రి బాటలోనే రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటికీ, ఇప్పటి వరకు కూడా రాజకీయంగా తన పూర్తి ప్రభావం చూపించడంలో కాస్త తడబాబుతూనే ఉన్నాడు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే మంత్రి పదవిలో కొనసాగాడు. ఇక 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలోకి దిగి ఎవరు ఊహించని విధంగా ఘోర ఓటమిని చవి చూశాడు. దీంతో నారా లోకేష్ పై వైసీపీ వ్యంగ్యస్త్రాలు, సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్, గట్టిగానే వచ్చాయి. లోకేష్ రాజకీయాలకు పనికి రాడని, లోకేష్ చేతిలో టీడీపీ స్థితిగతులు ఉండవంటూ వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతూనే ఉన్నాయి.

అయితే ఇదంతా ఒకప్పుడు ప్రస్తుతం లోకేష్ రాజకీయంగా కాస్త మొరుగుపడినట్లే తలుస్తోంది. తన మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అన్నిట్లోను మార్పు తీసుకొచ్చిన లోకేష్.. అధికార వైసీపీ పార్టీని ఇరుకునపెట్టె ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. పదునైన మాటలతో తెలుగుతమ్ముళ్లలో జోష్ నింపడమే కాకుండా వైసీపీ నేతలకు కూడా ధీటుగానే జవాబిస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన టీడీపీకి పునఃవైభవం తీసుకోచ్చేందుకు చంద్రబాబు తో పాటు లోకేష్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాల్లో నారా లోకేష్ కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల బరిలో అధికశాతం యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ సూచించారట.

అయితే లోకేష్ ఇచ్చిన ఈ సూచన తెలుగుతమ్ముళ్లలో జోష్ నింపేదే అయినప్పటికి, రాజకీయంగా మాత్రం కొంత చర్చకు దారితీసే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. యువతకు అవకాశం ఇవ్వడమంటే కేవలం టీడీపీ సీనియర్ నేతలను పక్కన్బెట్టి వారి స్థానంలో వారి కొడుకులను లేదా కూతుళ్లను బరిలోకి దించుతారా ? లేదా సామాన్య యువతకు స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారా ? అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఒకవేళ సామాన్య యువతకు కూడా స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే యువతలో లోకేష్ గ్రాఫ్ పెరిగే అవకాశం లేకపోలేదు. మరి 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్న చంద్రబాబు, లోకేష్.. యువత మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Also Read

భీహార్ లో బీజేపీ పతనం.. దేనికి సూచన ?

ఎన్నికలు వస్తేనే పథకాల అమలు జరుగుతుందా ?

మోడీ తలుచుకుంటే.. జగన్ వెనక్కు తగ్గుతాడా ?

Related Articles

Most Populer

Recent Posts