Friday, May 17, 2024
- Advertisement -

జ‌గ‌న్‌ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా…

- Advertisement -

ఊస‌ర వెల్లులు రంగులు మార్చ డం ఇప్ప‌టి వ‌ర‌కు చూశాం.. కాని దానికంటె భ‌యంక‌రంగా రంగులు మార్చ‌డం మ‌న రాజ‌కీయ‌నాయకుల‌కే ద‌క్కుతుంది. దీనికి తాజా ఉదాహ‌ర‌నే ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి. నిన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ నాకు రాజ‌కీయ భిక్ష‌పెట్టాడ‌న్న అన్న ఈశ్వ‌రిలో…. అంత‌లోనె ఎంత మార్పు వ‌చ్చిందంటె ఏకంగా జ‌గ‌న్‌మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చింది.

ఆర్థికంగా సరైన బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా టిక్కెట్‌ ఇచ్చి, ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించి, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇచ్చినందుకు జగన్‌ మీద గిడ్డి ఈశ్వరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాలనడం సబబేనా..? ఇదంతా బాబు ట్రైనింగ్ అనుకోవాల్సిందే.

పార్టీ మారిన వెంట‌నే వారి ‘రంగులు’ ఎలా మారిపోతాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆయన వల్లనే ఎమ్మెల్యేనయ్యా.. పార్టీని వీడటం నాకిష్టం లేదు.. అయిష్టంగానే టీడీపీలో చేరాను..’ అంటూ టీడీపీలో చేరాక కూడా చెప్పిన గిడ్డి ఈశ్వరి, అనూహ్యంగా ప్లేటు ఫిరాయించేసి, వైఎస్‌ జగన్‌ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెడతానంటూ హెచ్చరించడం కామిడి కాకుంటే మ‌రేమిటి.

ముఖ్యమంత్రిని గొడ్డలితో నరుకుతానని వీరావేశంతో ప్రకటించిన ఘనత గిడ్డి ఈశ్వరికే దక్కుతుంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా చూసుకోవడానికి సిద్ధమయ్యారు గిడ్డి ఈశ్వరి. భుజమ్మీద కండువా మారగానే, ఈక్వేషన్స్ ఎలా మారాయో గిడ్డి ఈశ్వ‌రిని చూస్తె అర్థ‌మ‌వుతుంది.

పార్టీ మారే ముందు స‌న్నిహితుల‌తో , ‘టీడీపీలోకి వెళ్ళడానికి ఇష్టం లేదు.. కానీ వెళుతున్నాను.. కుదిరితే మంత్రి పదవి, లేకపోతే మంత్రి పదవి లాంటి నామినేటెడ్‌ పదవి ఖాయం..’ అని ఆమె చెప్పిన విషయాలు రికార్డ్‌ అయ్యాయి.. ఆ వీడియో వైరల్‌ అయ్యింది. పదవుల కోసం పార్టీ మారినోళ్ళు.. అది తప్పని ఎవరన్నా ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడ్తా అన‌డం ఏంటో ఆమెకే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -