- Advertisement -

జగన్ ఆ జనసేన మాట వింటే రాష్ట్రం ఓ రేంజ్ లో ఉంటుంది.?

- Advertisement -

రాష్ట్రంలో మూడు రాజధానుల సంచలనం ఇప్పటికీ మారుమోగిపోతుంది.. ఇక అందరు ఈ మూడు రాజధానులకు అలవాటుపదిపోతున్నారు.. ధర్నాలు, పోరాటాలు చేసి టైం వేస్ట్ అనుకునే స్థితికి చేరుకున్నారు.. అయితే ఇప్పుడు ఓ కొత్తరకం వాదన వినపడుతుంది. రాష్ట్రంలో మూడు రాజధానులు నెలకొల్పారు సరే దానివల్ల అభివృద్ధి ఎలా అవుతుంది అని ప్రశ్నలు లేవనేత్తుతున్నారు.. పాలనా వికేంద్రికరణ అని చెప్పి జగన్ అమరావతి నుంచి రాజధాని ని విశాఖ కు, హై కోర్టు ను కర్నూల్ కి తరలించిన జగన్ చేయాల్సింది పాలనా వికేంద్రికరణ కాదు అభివృద్ధి వికేంద్రికరణ అని సలహా ఇస్తున్నారు.. 

తాజాగా జనసేన నేత హరిరామ జోగయ్య ఓ ఐడియా ముఖ్యమంత్రి జగన్‌కు పంపించారు. కాపు ఉద్యమానికి గట్టిగా నిలబడతానని చెప్పిన ఆయన రాష్ట్రంలో విశాఖ, కర్నూల్ జిల్లాలు ఒక్కటే కాదు మిగితా జిల్లాలు కూడా అభివృద్ధి బాటలో నడవాలి అని అయన డిమాండ్ చేశారు.. దానికి ఆయనే ఓ ఐడియా ఇచ్చారు కూడా.. సెక్రటేరియట్ మొత్తాన్ని విశాఖలో పెట్టడం వల్ల.. ఇతర జిల్లాలకు అన్యాయం జరుగుతుంది. శాఖల వారీగా.. అన్ని హెచ్‌వోడీలను. జిల్లాలకు పంపిణీ చేయాలి. అన్ని జిల్లాల్లోనూ ఒక్కో హెచ్‌వోడీ కార్యాలయం పెట్టడం ద్వారా.. ఆయా జిల్లాల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఏ ఏ జిల్లాల్లో ఏ రంగానికి ప్రాధాన్యం ఉంటుందో… అ రంగం ప్రధాన కార్యాలయం అక్కడ పెట్టాలని హరిరామ జోగయ్య అభిప్రాయం..

ఈ సీనియర్ నేత ఐడియా బాగానే ఉన్నా అది ఎంతవరకు అమలవుతుందనేదే అసలు ప్రశ్న.. వాస్తవానికి జగన్ వికేంద్రీకరణ ఐడియా కి జోగయ్య విస్తృత రూపం ఇచ్చారని చెప్పొచ్చు.. ఈ ఐడియా బాగానే ఉంది కాబట్టి జగన్ కూడా నచ్చే అవకాశం ఉంది.. ఒకవేళ జగన్ ఇది కానీ అమలు చేస్తే అమరావతి మూలంగా డ్యామేజ్ అయిన కొంత ఇమేజ్ మళ్ళీ రావడంతో పాటు పాలన లో మరింత మార్పులు జరిగి అభివృద్ధి మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -