Thursday, May 9, 2024
- Advertisement -

డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేశామ‌ని ఒప్పుకున్న టీడీపీ నేత‌….

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ గెలుపు మ‌రోసారి ర‌స‌వ‌త్త‌రాంగా మార‌నుందా..? గెలుపు మూన్నాల్ల ముచ్చ‌ట‌గానె మిగ‌ల‌నుందా…? అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. నంద్యాల‌లో రాష్ట్ర మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలను దింపి గెలుపే ల‌క్ష్యంగా చంద్రబాబు అమలు చేసిన చాణక్య వ్యూహం ఫలించింది.

అధికార‌పార్టీ వెలుపు వెనుక బాగోతాలు క్రమ క్రమంగా బయటపడుతున్నాయి. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో జరిగిన అక్రమాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలతో చంద్రబాబు రాజకీయ చాణక్యం బయట పడింది. 3 పీపీపీల‌తో గెలిచామ‌ని బాబు ఊద‌ర‌గొట్టారు. దాని వెనుకున్న అస‌లు సంగ‌తిని పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ బయట పెట్టారు

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.4000 ఇచ్చిన మాట నిజమేనని టీడీపీ నేత గన్ని కృష్ణ అంగీకరించారు. కానీ దీన్ని ఎన్నికల తాయిలంగా చూడొద్దని మ‌రో విధంగా క‌వ‌ర్ చేశారు. ఈ సంగతిపై ఎవరైనా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే కథ రసవత్తరంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

గ‌తంలో పొరుగున ఉన్న తమిళనాట మాజీ సీఎం, పురుచ్చితలైవిగా పేరొందిన జయలలిత మరణించడంతో ఆమె స్థానానికి నిర్వహించ తలపెట్టిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ కోట్లు ఖర్చు పెట్టారన్న ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికనే రద్దు చేసింది.

కొద్ది రోజుల‌క్రితం నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార పార్టీ టీడీపీ ఎలా అడ్డదారులు తొక్కిందో సాక్ష్యాధారాలతో వివరించారు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. ఎక్కడాలేని విధంగా కేవలం నంద్యాలలో మాత్రమే డ్వాక్రా మహిళల ఖాతాల్లో చంద్రబాబు ప్రభుత్వం డబ్బు జమచేసిందని, ఉప ఎన్నికకు ముందు ఒక్కో ఖాతాలో రూ. 4 వేలు చొప్పున వేసిందని ఆయ‌న వెల్ల‌డించారు.

జూలై 17 నుంచి ప్రారంభించి ఒక్కో గ్రూపునకు రూ. 48 వేలు చొప్పున నెల రోజుల్లో ముగించారని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పాస్‌బుక్‌ల కాపీలను మీడియాకు చూపారు. దీనిపై ఎవరు ఫిర్యాదు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. మ‌రి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=G4GYlMFYZ0o

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -