Monday, May 6, 2024
- Advertisement -

జగన్ చంద్రబాబు పై ఇలా పగ తీర్చుకుంటున్నాడా..?

- Advertisement -

రాజకీయాల్లో శాశ్వత కక్ష్య సాధింపులు ఏవీ లేకపోయినా తమ ఉనికి ఎల్లకాలం ఉండాలనే కోరిక మాత్రం నాయకులకు ఉంటుంది. ఆవిధంగా చంద్రబాబు ఇన్నిరోజులు చేస్తూ వచ్చాడు. సొంత మామ కే వెన్నుపోటు పొడిచి అయన సాధించిన ఉనికికి ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు ప్రజలు.. ఇక ప్రతిపక్ష నేతలైతే చంద్రబాబు ను విమర్శించాలంటే ఈ ఒక్కటి చాలు అన్నట్లు విమర్శిస్తున్నారు.. చంద్రబాబు కి పూర్తి విరుద్ధమైన రాజకీయాన్ని చేస్తున్నారు జగన్ అందడంలో ఎలాంటి సందేశం లేదు.. తనకన్నా చిన్నవాడైనా జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలి చంద్రబాబు..

ఎందుకంటే ఎక్కడా ఆవేశపూరితంగా, మోసపూరితమైన రాజకీయాలు చేయడం జగన్ కు చేతకావు.. ఇక జగన్ వైఖరి ఒక్కటే తన పై కక్ష్య సాధింపు చర్యలు చేసిన వారి అవినీతి వృక్షాలను వేళ్ళతో సహా పీకేయడమే.. ఆవిధంగానే ఆయన టీడీపీ కలుపు నేతలను ఏరిపారేస్తున్నారు.. ఇక అదే దారిలో నడుస్తూ టీడీపీ ని నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రణాళిక లు వేస్తున్నారు.. టీడీపీ కి బలమైన ప్రాంతం ఉత్తరాంధ్ర అని ఎవరైనా చెప్తారు.. అయితే జగన్ దెబ్బకు అది చెల్లాచెదురైపోయింది..

ఆ ప్రాంతంలో 34 నియోజక వర్గాలు ఉంటే కేవరలం అరడజను పచ్చ జెండాలు ఎగిరాయి.. జయనగరం జిల్లా అయితే ఒక్క సీటు టీడీపీకి దక్కకుండా వైసీపీ టోటల్ గా ఊడ్చేసింది. ఇక అదేవిధంగా ప్రముఖ నాయకులను గాలం వేస్తూ టీడీపీ ని వీక్ చేస్తున్నారు.. నిన్న మొన్నటివరకు వైసీపీ లోకి వస్తాడన్న గంటా ముఖ్య అనుచరుడు మాజీ ఎమ్మెల్యే, రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం అందులో భాగమే.అంతే కాదు మరింతమంది మాజీలు, మేటి నాయకులు వైసీపీలోకి క్యూకడుతున్నట్లుగా సమాచారం. వీరిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశం ఉందని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -