Friday, May 10, 2024
- Advertisement -

కేంద్రంపై పోరాటానికి జ‌గ‌న్ మ‌రో కొత్త అస్త్రం…

- Advertisement -

ప్ర‌త్యేక‌హోదాపై వైసీపీ ఎంపీల రాజీనామా అంకం ముగిసింది. ఇక జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా రాజ‌కీయ పార్టీలు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసి ఏపీభ‌వ‌న్‌లో ఆమ‌ర‌న నిర‌హారా దీక్ష‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఆరోగ్యం క్షీనించ‌డంతో పోలీసులు బ‌ల‌వంతంగా హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు.

ఇక ఇప్పుడు జ‌గ‌న్ చివ‌రి అరుదైన అస్త్రాన్ని బయటకు తీయడానికి సంసిద్ధమవుతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ వెన‌క్కు త‌గ్గితే అది రాజ‌కీయ‌జీవితమే ఇబ్బందుల్లో ప‌డుతుంది. ఇప్ప‌టికే ఎంపీల‌తో రాజీనామా చేయించిన జ‌గ‌న్ ఉద్య‌మాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్ళడానికి మరో మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్ప‌టికే పార్టీ ఎంపీలు రాజీన‌మా చేశారు కాబ‌ట్టి ఇక ఎమ్మెల్యేలు అందరితో కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబు నాయుడి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారవుతుందన‌డంలో సందేహం లేదు.

ఎంపీల‌తో రాజీనామా చేయించి కేంద్రంపై కొంత ఒత్తిడి పెంచినా ఇప్పుడు రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే గనుక రాష్ట్రంలో అది సంచలన విషయంగా మారుతుందని వైయస్సార్ కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాష్ట్రంలో ఉప ఎన్నికల వాతావరణాన్ని తీసుకు వస్తే గనుక పార్టీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఉప ఎన్నిక‌ల‌కు వెల్లినా లేకా ఏక‌గ్రీవంగా జ‌రిగినా తెలుగుదేశం పార్టీకి మాత్రం శ‌రాఘాత‌మే. అయితే దీనిపై త్వ‌ర‌లో క్లారిటీ వ‌చ్చే అక‌వాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -