Thursday, March 28, 2024
- Advertisement -

సీఎం జగన్ కాబోయే ప్రధాని.. ఎమ్మెల్యే కామెంట్

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా భారత దేశానికి ప్రధాన మంత్రి అయ్యే అర్హతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని పెనమలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు.

పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వార్డు వాలంటీర్లకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. ఏపీలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్న విధానంతో.. దేశమంతా రాష్ట్రం వైపే చూస్తోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని వ్యాఖ్యానించారు.   

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ ఖ్యాతి జాతీయస్థాయికి చేరిందన్నారు. రాష్ట్రాన్ని బంగారు భవిత దిశగా సీఎం జగన్ నడిపిస్తున్నారన్నారు. ఇలాంటి వారే భవిష్యత్ లో ప్రధాన మంత్రికి అర్హులు కాగలరని అన్నారు.  పార్థసారథి వ్యాఖ్యలకు వాలంటీర్లు కరతాల ధ్వనులతో హర్షాతికేరాలు వ్యక్తం చేయగా.. సీఎం జగన్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.

లాక్ డౌన్ పై మంత్రి కేటీఆర్ క్లారిటీ

నిజాయితికి నిలువెత్తు రూపం.. మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

ఉత్కంఠం రేపుతున్న అడవి శేషు ‘మేజర్’ టీజర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -