Wednesday, April 24, 2024
- Advertisement -

లాక్ డౌన్ పై మంత్రి కేటీఆర్ క్లారిటీ

- Advertisement -

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే ఇవాళ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 79,027 పరీక్షలు నిర్వహించగా.. 2251 కొత్త కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. కరోనా విజృంభించడంతో రాష్ట్రంలోని పలు గ్రామాలు లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. కేసులు పెరుగుతున్న వేళ.. రాష్ట్రవ్యాప్తంగా కూడా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఆరుగురు చనిపోయారు.

దీంతో కరోనా మృతుల సంఖ్య 1765కి చేరింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ‌లో లాక్ డౌన్ పెట్ట‌ము అని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.  కాని పెరిగిపోతున్న కేసులు, మరణాలను బట్టి మళ్లీ లాక్ డౌన్ విధిస్తారని ప్రజలు భయపడుతున్నారు. తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫుల్ టైమ్ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ప్రశ్నించగా.. లాక్ డౌన్ అనేది మంచి ఐడియా కాదని తాను భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు. లాక్ డౌన్ కావాలో.. మాస్కులు ధరించాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. కరోనా నియంత్రణ, మన ఆరోగ్య భద్రత మన చేతిలోనే ఉందని అన్నారు.

పవన్ పిల్లలతో అడవిశేషు.. ఫోటో వైరల్!

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

వింత రూపంతో.. అవిభక్త కవలల జననం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -