Saturday, May 11, 2024
- Advertisement -

పాద‌యాత్ర‌లో పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌….

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ర్నూలు జిల్లాలో పాద‌యాత్ర కొన‌సాగుతోంది. క‌పాద‌యాత్ర‌లో భాగంగా బ‌ణ‌గాన‌ప‌ల్లి మండ‌లం ఉసేనా పురంలో మ‌హిళా స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈస‌భ‌కు రాకుండా మ‌హిల‌ళ‌ల‌ను స్థానిక పోలీసులు అడ్డుకోవ‌డంతో జ‌గ‌న్ పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ చంద్రబాబు పాలన మాత్రమే ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని జగన్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఉసేనాపురంలో నిర్వహించిన మహిళా సదస్సులో నేడు జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలన్నారు.

పోలీసులు ప్రభుత్వం కోసం, టోపీ మీదున్న మూడు సింహాల కోసం మాత్రమే పని చేయాలని… ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తాను… అక్కలు, చెల్లెమ్మల సమస్యలు వినేందుకు వస్తే, మీరు అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -