Sunday, May 12, 2024
- Advertisement -

లోకేశ్ పాదయాత్ర.. వైసీపీ నేతలెందుకు అంత ఖుషీ!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారాలోకేశ్ వచ్చే ఏడాది జనవరి 27 నుంచి పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నారా లోకేశ్ ఇటీవల కన్ఫమ్ చేశారు కూడా. కుప్పం నుంచి మొదలు పెట్టి ఇచ్చాపురం వరకు ఈ పాదయాత్ర కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. 400 రోజుల్లో 4000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర చేపట్టబోతున్నారు లోకేశ్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపికి లోకేశ్ పాదయాత్ర మంచి మైలేజ్ ఇస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. అందుకే ఈ పాదయాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇక పాదయాత్రలో భాగంగా ప్రతి నియోజిక వర్గంలో నాలుగు రోజులు పర్యటించి పార్టీని బలోపేత మ్చేయనున్నారు నారా లోకేశ్.

ఇదిలా ఉండగా లోకేశ్ పాదయాత్రను వైసీపీ చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే లోకేశ్ ను కేవలం చంద్రబాబు తనయుడిగానే ప్రజలు చూస్తున్నారు తప్పా.. రాజకీయ నాయకుడిగా లోకేశ్ ను ప్రజలు అధరించే పరిస్థితి లేదనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. అందువల్ల లోకేశ్ పాదయాత్ర గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒక విధంగా లోకేశ్ పరిపక్వత లేమి ని ప్రజలు దగ్గర నుంచి చూస్తారు కాబట్టి అది టీడీపీకే నష్టం కలుగుతుంది తప్పా వైసీపీకి కాదని ఆ పార్టీ నేతల అభిప్రాయం.

ఇక పాదయాత్ర అంటే అందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ లే అందరికీ గుర్తొస్తారు కానీ చంద్రబాబు చేసిన పాదయాత్ర ఎవరికి గుర్తు లేదని, ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర చేసిన అంతేనని, మంత్రి కురసల కన్నబాబు ఇటీవల వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే లోకేశ్ పాదయాత్రను వైసీపీ ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి నారా లోకేశ్ చేపడుతున్న పాదయాత్ర టీడీపీకి మాత్రమే కాకుండా ఆయనకు కూడా చాలా కీలకమే. గత కొన్నాళ్లుగా బలమైన రాజకీయ నేత గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న లోకేశ్.. ఈ పాదయాత్రతో ప్రజల్లో మమేకం అయి తన మార్క్ రాజకీయాలను ప్రజలకు పరిచయం చేయాలని భావిస్తున్నారు లోకేశ్. మరి పాదయాత్ర లోకేశ్ కు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

రౌడీ సేన కాదు.. విప్లవ సేన : పవన్ కల్యాణ్!

త్రీ క్యాపిటల్స్ స్వలాభమా.. ప్రజా లాభమా!

బాబుకు మోడీ పిలుపు.. బంధం బలపడేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -