ఉమా మహేశ్వరి మరణంపై రాజకీయం చేస్తోన్న వైసీపీ !

- Advertisement -

ఇటీవల స్వర్గీయ ఎన్‌టి రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెది సాధారణ మరణం కాదని, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఎంటనే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నందున.. అనారోగ్య సమస్యలను భరించలేకే ఆమె ఊరి వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజకీయాలకు ఏమాత్రం సంభందం లేని ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు..

ఉమా మహేశ్వరి మరణాన్ని ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు.. పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ” ఉమా మహేశ్వరి మరణంపై అనుమానాలున్నాయి. చంద్రన్న వేధించడా ? లేదా ఇంకెవరైనా చంపి ఊరితీశారా ? ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటే ఎవరు నమ్మడం లేదు” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆమె మరణంపై సి‌బి‌ఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. దీంతో విజయ సాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

అయితే విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ళు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇంటి మనిషి చనిపోయి దుఖంలో ఉన్న కుటుంబాన్ని రాజకీయం చేయడం వైసీపీ నేతలకే చెల్లిందంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి శవరాజకీయాలు చేయడం వైసీపీ నేతలు మనుకోవాలంటూ మండి పడుతున్నారు. మరి మహేశ్వరి మరణాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్న వైసీపీ నేతలపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -