Wednesday, April 24, 2024
- Advertisement -

ఎక్కువకాలం బతకాలంటే… ఈ తొమ్మిది ఉండాల్సిందే

- Advertisement -

జపాన్‌ దేశంలో వందేళ్లకు పైబడిన వాళ్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. గ్రీస్‌ దేశంలో అయితే మనిషి సగటు ఏజ్ 90 ఏళ్లకు పైగానే అంటే నమ్మలేం కదా. కాని అది నిజం. అలాగే కోస్టారికాలోనూ లాంగ్ టైమ్ జీవించే వారు ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి వార్తలు మనం చూస్తే ఏమనిపిస్తుంది? బ్లూ జోన్‌లుగా పిలిచే ఈ ప్రాంతాల్లోనే మనుషులు ఎక్కువ కాలం ఎలా బతుకుతున్నారు అనేగా. ఈ విషయం తెలుసుకోడానికే డాక్టర్‌ డాన్‌ బుట్‌నెర్‌ నేతృత్వంలోని ఓ బృందం రీసెంట్ గా ఓ స్టడీ చేసింది. వైద్యులు, మానవ పరిణామ శాస్త్రవేత్తలు, జనాభా, పౌష్టికాహార, వ్యాధి వ్యాప్తి నిపుణులున్న ఈ బృందం.. అన్ని బ్లూ జోన్‌ ప్రాంతాల్లో తిరిగి అక్కడి వారి జీవన విధానాలు పరిశీలించింది. ఇవన్నీ చేశాక వారు మనలాగ ఎక్కువకాలం బతకాలనుకునేవారికి ఓ తొమ్మిది సూత్రాలు ప్రతిపాదించారు.

1. రోజువారీ పనుల్లో ఫిజికల్ వర్క్స్ ఎక్కువగా చేయడం అంటే. శరీరానికి పని చెప్పే పనులను చేయడం. టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడమన్నది ఇక్కడి వారికి అంతగా తెలియదు. దానిని వారు అవసరమైతేనే వాడతారు.లేదంటే దూరం పెట్టేస్తారు.
2. మజ జీవితానికి పరమార్థం ఏమిటో వెతుక్కోవాలి. జపనీస్‌ భాషలో దీనిని ఇకగాయి అంటారట.అలా చేయడం వలన మనం ఎందుకు బతుకుతున్నామో ఓ క్లారిటీ వస్తుంది.
3. ఏజ్డ్ పీపుల్ కు ఒత్తిడిని తెచ్చే పనులను ,సమస్యలను దూరంగా ఉంచడం. అలవాటుపడిన వేగంతో కాకుండా భిన్నంగా రోజువారీ పనులు చేసి మరిన్ని పనులకు సమయం సృష్టించుకుంటే ఒత్తిడిని దూరంగా ఉంచడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కోసమని వారు ఓ కునుకు తీయడం మధ్యధరా ప్రాంత వృద్ధులకు అలవాటైతే.. జపాన్‌లోని ఒకినావా ద్వీపవాసులు తేనీటి ఉత్సవాల్లో మునిగి తేలతారు. కొంతమంది ప్రార్థనలు చేసి ఒత్తిడి తగ్గించుకుంటారు.
4. పొట్టకు పట్టేంత కాకుండా కొంచెం ఖాళీ ఉండేలా తినడమనే సూత్రాన్ని దీర్ఘాయుష్షు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజలు భాగా ఆచరిస్తున్నారు.
5.వెజిటేరియన్స్ ఎక్కువగా.. మాంసాహారం, చేపలు, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవడం ఎక్కువ కాలం బతికేందుకు సాయపడతాయట.
6. మద్యపానం చేయని వారి కంటే లిమిట్ లో తాగే వారు ఎక్కువ కాలం బతుకుతారని తెలిసింది..
7. హెల్దీగా ఉండే వారితో ఎక్కువగా సంబంధాలు కలిగి ఉండటం.
8. మతపరమైన గ్రూపుల్లో మంచి విషయాల కోసం భాగస్వామి కావడం.
9. భార్య, పిల్లలే కాకుండా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులతో మంచి సంబంధాలు మెయిన్ టైన్ చేయడం .అది ఇటు ఇల్లాలుకు భర్తకు చాలామంచిగా ఉపయోగపడుతుంది. మానసిక ఆందోళన దూరం చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -