Saturday, April 27, 2024
- Advertisement -

వీణా-వాణి ల భ‌విష్య‌త్తుప‌పై చిగురిస్తున్న ఆశ‌లు….

- Advertisement -

ఇద్ద‌రి త‌ల‌లు క‌ల‌సిపోయి పుట్టిన అవిభ‌క్త క‌వ‌ళ‌లు వీణా-వాణీల భ‌విష్య‌త్తుపై క‌మ్ముకున్న నీలినీడ‌లు తొలగిపోయె ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వారి జీవితంపై ఆశ‌లు చిగురిస్తున్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అరుదైన శస్త్రచికిత్సను ప్రారంభించారు. వీణావాణి మాదిరే తలలు అతుక్కుని పుట్టిన కవలలకు ఈ శస్త్రచికిత్సకు వైద్యులు శ్రీకారం చుట్టారు.

వివ‌రాల్లోకి వెల్తే …ఒడిశా కంధమాల్ జిల్లాలో ఓ పేద రైతుకుటుంబంలో పుట్టిన జగన్నాథ్, బలియాలను వేరుచేసే హిస్టారికల్‌ ఆపరేషన్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి వయసు రెండు సంవత్సరాల మూడు నెలలు. ఇద్ద‌రిలో ఒక‌రిని కాపాడినా ఒక‌రు బ్ర‌తికినా చారిత్ర‌క‌ఘ‌ట్టంగా మిగిలిపోతుంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. మెదడు నుండి గుండెకు రక్తాన్ని పంప్‌ చేసే సిరలను కవలలిద్దరూ పంచుకుని పుట్టడంతో ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైందని వైద్యులు చెప్పారు.

దాదాపు 40మంది స్పెషలిస్టులు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 50 గంటలపాటు ఈ ఆపరేషన్‌ కొనసాగనుంది. మొదటి దశలో 6నుంచి 8 గంటలపాటు ఉంటుందని సమాచారం. పీడియాట్రిక్‌ న్యూరో సర్జన్లు, న్యూరో-అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియోవాస్క్యులర్‌ సైన్సెస్‌కు చెందిన నిపుణులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. వీరికితోడు ఈ ప్రక్రియలో జపాన్ ఎక్స్‌పర్ట్‌ కూడా సహాయపడనున్నారు.

అయితే ఇటీవలి కాలంలో న్యూయార్క్‌లోని ని మాంటెఫియోర్ ఆసుపత్రి సర్జన్లు 13 నెలల వయస్సున్న కవలలను విజయవంతమైన వేరు చేయడం విశేషం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి అరుదైన ఆప‌రేష‌న్లు చేయ‌డానికి 50 శాతం ప్ర‌య‌త్నించ‌గా…అందులో 25 శాత‌మే స‌క్సెస్ సాధించారు. ఈ ఆప‌రేష‌ణ్ విజ‌య‌వంతం అయితె …. వీణావాణి కష్టాలు కూడా తీర‌నున్నాయి. ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం కావాల‌ని దేవున్ని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -