Friday, April 26, 2024
- Advertisement -

రేవంత్‌రెడ్డి లీకులు…? హ‌డ‌లిపోతున్న ఏపీ టీడీపీ నాయ‌కులు..?

- Advertisement -

నిన్న తెలంగాణాలో ఐటీ దాడులు జరిగాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ నేతలు, మంత్రుల ఇళ్లను టార్గెట్‌ చేసినట్లు సమాచారం. పోలీసుల బందోబస్తుతో గుంటూరు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వ‌హించారు. సదరన్‌ డెవలపర్స్‌, వీఎస్‌ లాజిస్టిక్‌ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. ఈ సోదాల్లో టీడీపీకీ చెందిన ఓ మంత్రి అమ‌రావ‌తి భూదందాకు సంబంధించి కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొన్న‌ట్లు తెలుస్తోంది.

ఐటీ దాడుల‌పై టీడీపీ నాయ‌కులు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నారు. ఐటీ దాడుల నేప‌థ్యంలో కొంద‌రి టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఈ దాడుల వెనుక ఓటుకు నోటు కేసు ఉంద‌నేది తెలుస్తోంది. రెండు మూడు రోపుల‌క్రితం రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాల‌యాల‌పై దాడులు చేసిన ఐటీ అధికారులు రేవంత్‌రెడ్డిని విచారించారు. విచార‌ణ‌లో ఆయ‌న ఇచ్చిన లీకుల‌తోనే ఈ దాడులు జ‌రుగుతున్న‌ట్లు వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రూ. 50 ల‌క్ష‌ల న‌గ‌దుతో ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. దానికి సూత్ర‌ధారి అయిన చంద్ర‌బాబు కూడ ఆడియో టేపుల్లో దొరికిన సంగ‌తి తెల‌సిందే. తెలంగాణాలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ కేసును విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. ఎమ్మెల్యే కొనుగోలుకు ఐదు కోట్లు ఎవ‌రు స‌మ‌కూర్చార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డిని అధికారులు విచారించినప్పుడు.. ప్రధానంగా… లంచంగా ఇవ్వజూపిన 50 లక్షల గురించే ప్రశ్నించారు.

ఆ డ‌బ్బును ఏపీకీ చెందిన బ‌డా టీడీపీ నేత‌లు స‌మ‌కూర్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. అదే విధంగా విచార‌ణ‌లో రేవంత్ రెడ్డి ఏమైనా లీడ్ ఇచ్చాడా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మంత్రినారాయ‌ణ‌, బీద మ‌స్తాన్ రావుతొ పాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఇళ్ల‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.

నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ప్రముఖ పారిశ్రామిక వేత్త బీద మస్తాన్‌రావు ఫ్యాక్టరీలు, నివాసాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించారు. చెన్నైలోని మస్తాన్‌రావు నివాసం, కార్పోరేట్ కార్యాలయం, నెల్లూరులోని కార్యాలయం, కావలి సమీపంలోని విమానాశ్రయ భూముల వద్ద రోయ్యల మేత ఫ్యాక్టరీ, రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ యూనిట్‌పై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఒక వేల ఆ రూ.50 ల‌క్ష‌లు నావే అని ఒప్పుకుంటే దానికి సంబంధించిన ఆదాయ వనరుల గరించి కూడా చెప్పి ఉండాలి. సోదాల స‌మ‌యంలో కీల‌క డాక్యుమెంట్ల‌తోపాటు, హార్డ్‌డిష్క్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని శోధించడంలో నారాయణ పాత్ర ఏమైనా వెలికి వచ్చిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అందుకే తమకు లీడ్ అందిన విషయం డిలేకాకముందే.. నారాయణ కాలేజీలు, ఆస్తులు, నివాసాలపై ఏకకాలంలో దాడులు మొదలెట్టినట్లు అనుకుంటున్నారు. మంత్రి నారాయణ చంద్రబాబునాయుడుకు చాలా సన్నిహితులైన, విశ్వసనీయులైన మంత్రుల్లో ఒకరు. అధికారులు ఈ దాడుల‌పై క్లారిటి ఇస్తే గాని వేడి చ‌ల్లార‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -