Sunday, April 28, 2024
- Advertisement -

బీసీలపై బాబు వివక్ష!

- Advertisement -

బీసీలంటే మొదటి నుండి పడని చంద్రబాబు తన బుద్దిని మరోసారి బయటపెట్టారు. జనసేనతో పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేయగా అందులో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. వాస్తవానికి ఎన్టీఆర్ బీసీలకు పెద్దపీట వేశారు. ఒకవిధంగా చెప్పాలంటే బీసీలను రాజకీయాల్లో ప్రోత్సహించిందే ఎన్టీఆర్. అందుకే ఎంతోమంది బీసీలు , దిగువ, నిమ్న కులాల నాయకులు, చివరికి పేద వాళ్ళు సైతం చట్ట సభలకు ఎన్నికయ్యేవారు.

కానీ అదంతా గతం. చంద్రబాబు వచ్చాక బీసీలను వెనుక బెంచికి నెట్టేసి కేవలం డబ్బున్నవాల్లు, పెట్టుబడిదారులు.. కార్పొరేట్ నాయకులు..అగ్ర వర్ణాల వారికి మాత్రమే పార్టీ అలవాలమైంది. డబ్బులేని వాళ్ళు.. కింది స్థాయి వాళ్ళు మెల్లగా పార్టీ నుంచి కనుమరుగైపోయారు.

బీసీలు అంటే వర్ణ వ్యవస్థలో కింది కులాల వాళ్ళు కాబట్టి వారిని కిందనే ఉంచాలన్నది చంద్రబాబు తత్వం. వారికి అవకాశాలు ఇవ్వరాదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలన్నది ఆయన విధానంగా మారింది. అందుకే 45 % జనాభా ఉన్న బీసీలకు 18 సీట్లే ఇచ్చారు. మైనారిటీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చి మమా అనిపించగా 4% జనాభా ఉన్న కమ్మలకు మాత్రం 21 సీట్లు ఇచ్చారు.

గతంలో బీసీల తోకలు కట్ చేస్తానన్న బాబు నేడు ఆ మాటను నిజం చేశారు. సీట్లు కట్ చేసి వారిని రాజకీయంగా వెనక్కి నెట్టేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -