Monday, April 29, 2024
- Advertisement -

ఏ ప్రాంతంపై వివక్ష లేదు..అభివృద్ధే ఎజెండా

- Advertisement -

ముఖ్యమంత్రి జగన్ అన్నింటికి ఒక్కటే సమాధానంతో స్పష్టత ఇచ్చేసారు. తన విజన్ ఏంటో క్లారిటీ ఇచ్చారు. తాను మరోసారి అధికారం పైన ఎంత ధీమాతో ఉన్నారో చెప్పకనే చెప్పారు. విశాఖలోనే ఈ సారి తన ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు. తాను విశాఖలోనే ఉండబోతున్నట్లు స్పష్టం చేసారు. మెట్రో నగరాలకు ధీటుగా విశాఖను తీర్చి దిద్దుతామన్నారు.

విజన్‌ విశాఖ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు.స్వయం సహాయక బృందాల పెండింగ్‌ రుణాలను మాఫీ చేశామని చెప్పారు.విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని.. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్‌ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌లా మారుస్తామని జగన్‌ వివరించారు. విశాఖ నుంచి పరిపాలనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వుంటే నగరం అభివృద్ధి బహుముఖంగా జరుగుతుందన్నారు. తనకు ఏమీ వ్యక్తిగత ఆలోచనలు, ప్రయోజనాలు లేవు….రాష్ర్ట అభివృద్ధి ఒక్కటే లక్ష్యమన్నారు. బెంగలూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం వైజాగ్‌కు ఉంద‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.తనకు అమరావతితో సహా ఏ ప్రాంతం పైనా వ్యతిరేకత లేదని చెప్పుకొచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం తాము పని చేస్తున్నామని వెల్లడించారు.

అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని చెప్పిన జగన్ అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాలా కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని.. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్‌ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌లా మారుస్తామని జగన్‌ వివరించారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో​ విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సీఎం జగన్‌ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -