Friday, March 29, 2024
- Advertisement -

భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా..?

- Advertisement -

సాధారణంగా మన శరీరంలోని జీవక్రియలు సరైన క్రమంలో పనిచేయాలంటే తప్పనిసరిగా మన శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంది. మన శరీరంలో జరిగే వివిధ జీవక్రియలు నీటి పైన ఆధారపడి ఉంటాయి. కనుక మన శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంది. అందుకే ప్రతిరోజు వీలైనంతగా నీటిని తాగాలని మనకు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామందికి నీటిని తాగే విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

భోజనం చేసే ముందు నీటిని తాగవచ్చా? భోజనం చేసిన వెంటనే నీటిని తాగకూడదు? భోజనం మధ్యలో నీటిని తాగడం వల్ల ఏం జరుగుతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మరి భోజనం చేసేటప్పుడు నీటిని తాగవచ్చా అనే అంశంపై ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Also read:రసవత్తరంగా మారిన “మా” ఎన్నికలు.. బరిలోకి ఓ. కళ్యాణ్?

సాధారణంగా చాలా మంది భోజనానికి ముందు నీటిని తాగటం వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతుంటారు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే కాకుండా ఒక 5నిమిషాల తర్వాత నీటిని తాగడం ఎంతో ఉత్తమమని చెబుతారు. కానీ భోజనం మధ్యలో అధికంగా నీటిని తాగకూడదు. భోజనం చేసే సమయంలో కేవలం నీటిని కొద్ది పరిమాణంలో సిప్ చేస్తూ తాగటం ఉత్తమమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also read:అంత వంగకు అనసూయ… అనసూయ డ్రెస్ పై కామెంట్స్ చేసిన సుమ?

మనం ఆహారం తీసుకున్నప్పుడు ఈ విధంగా కొద్ది కొద్ది పరిమాణంలో నీటిని తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఈ నీరు దోహదపడుతుంది. అదే విధంగా ఎక్కువ పరిమాణంలో నీటిని తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం కాక కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. దీంతో అధిక శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. అందుకోసమే భోజనం చేసే సమయంలో ఎక్కువ పరిమాణంలో కాకుండా కొద్దిగా నీటిని తాగాలని నిపుణులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -